మెగా మనవరాలి జాతకంలో రాజయోగం !

Seetha Sailaja
రామ్ చరణ్ ఉపాసన లకు కూతురు పుట్టడంతో మెగా కాంపౌండ్ సంబరాలు చేసుకుంది. ఫిలిమ్ ఇండస్ట్రీలోని ప్రముఖులు అంతా చిరంజీవికి చరణ్ కు వ్యక్తిగతంగా సోషల్ మీడియా ద్వారా అబినందనలు తెలియచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ కూతురు జాతకం గురించి సినిమా తారల జాతకాల పై తరుచూ భవిష్యత్ తెలియచేసే జ్యోతిష్కుడు వేణు స్వామి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.


చిరంజీవి మనవరాలు పునర్వసు నక్షత్రంలో పుట్టడంతో ఆ అమ్మాయికి రాజయోగం పడుతుందని ఆమె జాతక చక్రంలో గ్రహాలు చాలా ఉచ్చస్థితిలో ఉన్నాయని దానివల్ల చిరంజీవి చరణ్ ఉపాసన సురేఖ ల జాతకాలలో కూడ ఉజ్వల భవిష్యత్ ఉంటుందని వేణు స్వామి భవిష్యవాణి తెలియచేస్తోంది. వాస్తవానికి తనకు రాజయోగం పడుతుందని చిరంజీవి గతంలో ‘ప్రజారాజ్యం’ ద్వారా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే అతడి ఆశలు నెరవేరలేదు.


ప్రస్తుతం అదే మెగా కుటుంబానికి చెందిన పవన్ కళ్యాణ్ తనకు రాజయోగం కలిగించమని గోదావరి జిల్లాలో వారాహి యాత్ర చేస్తున్నాడు. ఇప్పుడు చరణ్ కూతురు జాతకంలో రాజయోగం కనిపిస్తోంది అని వేణు స్వామి చెప్పడంతో ఈ పాప జాతక ప్రభావ్వంతో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కోరిక నెరవేరుతుందేమో చూడాలి. వేణు స్వామి చాలామంది సినిమా సెలెబ్రెటీ లకు చెప్పిన జాతకాలు నిజం అవుతున్నాయి.

గతంలో నాగచైతన్య సమంతల పెళ్లి తరువాత వారి వివాహ బంధం పై లేటెస్ట్ గా ప్రభాస్ జాతకం పై వేణు స్వామి చెప్పిన మాటలు నిజం అయ్యాయి. ఆమధ్య రష్మిక వేణు స్వామి సలహాతో హోమం చేసింది అన్నవార్తలు కూడ వచ్చాయి. నిరంతరం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే వేణు స్వామి మాటలు నిజం అయి చరణ్ కూతురుకు రానున్న కాలంలో రాజయోగం పడితే చిరంజీవి పవన్ లు సాధించలేకపోయింది వేణు స్వామి భవిష్య వాణి నిజం అవుతుంది అన్నకామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: