సూపర్ స్టార్ మహేష్ బాబు "సర్కారు వారి పాట" లాంటి బ్లాక్ బాస్టర్ విజయం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న గుంటూరు కారం అనే పవర్ఫుల్ యాక్షన్ ప్లస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తూ ఉండగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ బృందం ఈ సినిమాలో పూజా హెగ్డే ... శ్రీ లీల హీరోయిన్ లుగా నటించబోతున్నట్లు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. అలాగే ఇప్పటికే వీరిపై కొన్ని సన్నివేశాలను కూడా ఈ మూవీ బృందం రూపొందించింది.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పూజ హెగ్డే భద్రాచల కీలకంగా ఉండబోతుంది అని ... ఆ తర్వాత ప్రాముఖ్యత శ్రీ లీల పాత్రకు ఉండబోతుంది అని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం అందుతున్న వార్తల ప్రకారం ఈ మూవీ బృందం పూజా హెగ్డే కంటే కూడా శ్రీ లీల పైనే ఎక్కువ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ... అలాగే ఈ ముద్దు గుమ్మ పైనే అదిరిపోయే మాస్ సాంగ్స్ ను రూపొందిస్తున్నట్లు ... దానితో పూజా హెగ్డే కంటే కూడా స్క్రీన్ స్పేస్ లో కూడా శ్రీ లీల కే ఈ మూవీ మేకర్స్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ప్రస్తుతం పూజా హెగ్డే కంటే కూడా శ్రీ లీల నే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ పూజా హెగ్డే ను ఈ సినిమా నుంచి తప్పించే అవకాశాలు ఉన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.
ఇది ఇలా ఉంటే ఇది వరకే మహేష్ ... త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన అతడు , ఖలేజా మూవీ లకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించడంతో గుంటూరు కారం మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.