వావ్: మెగా కుటుంబంలో సంబరాలు.. మెగా ప్రిన్సెస్ రాకతో..?

Divya
చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా పేరు సంపాదించారు. తను నటించి చిత్రాలన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే చిత్రీకరిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున మెగా అభిమానులకు ఒక శుభవార్తను తెలియజేశారు.. అదేమిటంటే ఈరోజు తెల్లవారుజామున రామ్ చరణ్ సతీమణి ఉపాసన ఒక పండంటి పాపకు జన్మనిచ్చింది. దీంతో మెగా అభిమానులతో పాటు మెగా కుటుంబ సభ్యులు ఉపాసన కుటుంబ సభ్యులు చాలా ఆనందంతో ఉన్నట్టు తెలుస్తోంది. జూన్ 20వ తేదీన అంటే ఈరోజున ఉదయం నాలుగు గంటలకు మెగా వారసురాలు జన్మించిందనే విషయాన్ని అపోలో హాస్పిటల్ నుంచి అధికారికంగా ఒక లెటర్ ద్వారా తెలియజేశారు.

హైదరాబాదులోని అపోలో ఆసుపత్రిలో ఉపాసన డెలివరీ అయినట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవి సురేఖ దంపతులు ఉపాసన తల్లిదండ్రులు సైతం అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది . మెగా ప్రిన్సెస్ రాకతో అటు మెగా కుటుంబంలో కామినేని కుటుంబంలో సంబరాలు అప్పుడే మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. రాంచరణ్ సినిమాల విషయానికి వస్తే గత కొద్దిరోజులుగా సినిమాలన్నిటికీ గ్యాప్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.ఉపాసన డెలివరీ తర్వాతనే సినిమా షూటింగులు మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తున్నారు.

ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ బుచ్చిబాబుతో ఒక సినిమా చేయబోతున్నారు.చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తూ ఉన్నారు ఈ సినిమా కూడా తమిళం నుంచి రీమిక్స్ చేయడం జరిగింది. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య  సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న చిరంజీవి భోళా శంకర్ సినిమాని ఆగస్టు నెలలో విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. చిరంజీవి కూడా ఉపాసన డెలివరీ కావడంతో కొద్దిరోజులు షూటింగ్ కి బ్రేక్ చెప్పినట్టుగా సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: