తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన నటుడి గా ఎంతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటు వంటి నరేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన అలనాటి కాలంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి ఎన్నో విజయాలను అందుకొని గొప్ప గుర్తింపును తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈ నటుడు ఎక్కువ శాతం సినిమాల్లో చాలా ముఖ్యమైన కీలక పాత్రలలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈ మధ్య కాలంలో నరేష్ నటించిన సినిమాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా నరేష్ "మళ్లీ పెళ్లి" అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో పవిత్ర లోకేష్ ... నరేష్ కు జోడిగా నటించింది. ఈ మూవీ కి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో గొప్ప గొప్ప సినిమాలను నిర్మించి గొప్ప నిర్మాతగా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఎం ఎస్ రాజు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం మే 26 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయింది.
దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరిచిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ జూన్ 23 వ తేదీ నుండి ఆహా "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతున్నట్లు తెలుస్తోంది.