పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ రాముడి అవతారంలో అభిమానులకు అయితే ఫుల్ ట్రీట్ ఇచ్చాడు. ఆయన నటించిన ఆదిపురుష్ సినిమా శుక్రవారం (జూన్ 16)న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది.దాదాపు 7000 థియేటర్లలో విడుదలైన ఈ మైథలాజికల్ మూవీకి మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. వీఎఫ్‌క్స్ బాగోలేదని, డైరెక్టర్ ఓం రౌత్ రామాయణాన్ని వక్రీకరించాడని విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా అతనిపై భారీగా ట్రోల్స్ వస్తున్నాయి. దీంతో 'ఓం.. కమ్ టు మై రూమ్' అన్న ప్రభాస్ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. ఈ క్రమంలో ఆదిపురుష్ సినిమా రిలీజ్ తర్వాత మొదటిసారి స్పందించారు డైరెక్టర్ ఓం రౌత్. ట్విట్టర్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ని ఆయన షేర్ చేశారు. ఆదిపురుష్ థియేటర్లలో హనుమంతుడి కోసం కేటాయించిన సీట్ల ఫొటోస్ అన్నింటినీ కోలేజ్ రూపంలో షేర్ చేస్తూ ' దేశంలోని అన్ని థియేటర్లు ఆధ్యాత్మిక భావనతో నిండిపోయాయి' అని మెన్షన్ చేశారు. ఇక దీనికి 'జై శ్రీరామ్' అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
అయితే ఎప్పటిలాగే నెటిజన్లు మళ్ళీ ఓం రౌత్ పై ట్రోలింగ్‌కు దిగారు. 'రౌత్.. ఎక్కడువున్నావ్' అంటూ అతనిపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.విమర్శలు, ట్రోల్స్ వస్తున్నా కూడా మొదటి రోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపింది . ఏకంగా 140 కోట్ల వసూళ్లు రాబట్టి టాక్ తో సంబంధం లేకుండా రికార్డుల వేట మొదలెట్టింది.ఇక బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్‌కు మంచి సాలిడ్ హిట్ దొరికిందని ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆదిపురుష్ లో సీతగా కృతిసనన్ నటించారు. రెట్రో ఫైల్ సమర్పణలో టీ సిరీస్ బ్యానర్ పై నిర్మాత భూషణ్ కుమార్ ఏకంగా రూ.550 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించడం జరిగింది. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ ఇదే కావడం విశేషం.