శ్రీ లీల మ్యానియా చూసి పూజ హెగ్డే ఖంగారు పడుతోందా ?

Seetha Sailaja
డస్కీ బ్యూటీగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే ఈమధ్య వరకు ఇండస్ట్రీలో అదేవిధంగా యూత్ లో మంచి క్రేజీ బ్యూటీగా ఒక వెలుగు వెలిగింది. ‘అల వైకుంఠ పురములో’ సినిమా బ్లాక్ బష్టర్ హిట్ అవ్వడంతో ఆమె దక్షిణాది సినిమా రంగంలో కొన్ని సంవత్సరాల పాటు ఒక వెలుగు వెలుగుతుంది అని అందరూ భావించారు.


అయితే గత సంవత్సర కాలం పైగా ఆమెను వరసపెట్టి ఫ్లాప్ లు పలకరిస్తున్నాయి. తెలుగులో తమిళంలో ఆఖరికి హిందీలో ఆమె చేసిన సినిమాలు అన్నీ వరసగా ఫెయిల్ అవుతున్న పరిస్థితులలో నిన్న మొన్నటివరకు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఆమెకు ఇప్పుడు ఐరన్ లెగ్ బ్యూటీ అన్న ట్యాగ్ లైన్ తో పిలుస్తున్నారు.


ఇలాంటి పరిస్థితుల మధ్య ఆమె ఇండస్ట్రీలో దూసుకు పోతున్న శ్రీలీల పట్ల అబద్రతా భావంతో ఉందా అంటూ కొందరు సోషల్ మీడియాలో ఊహాగానాలు చేస్తున్నారు. ఇలాంటి ఊహాగానాలు మొదలుకావడానికి ఒక ఆశక్తికర కారణం ఉంది. పూజ శ్రీలీల తో కలిసి త్రివిక్రమ్ దర్శకత్వంలో షూటింగ్ జరుపుకుంటున్న మూవీలో నటిస్తోంది. ఆమధ్య సుమారు వారం రోజుల పాటు వీరిద్దరి పై కాంబినేషన్ సీన్స్ కూడ తీశారని టాక్.


ఈమధ్యనే శ్రీలీల పుట్టినరోజు జరిగింది. ఆ పుట్టినరోజు సందర్భంగా అనేక నిర్మాణ సంస్థలు దర్శకులు కొందరు హీరోయిన్స్ ఆమెకు సోషల్ మీడియా ద్వరా అభినందనలు తెలియచేసారు. అయితే ఆమెతో సినిమాలో కలిసి నటిస్తున్న పూజా హెగ్డే శ్రీలీలకు   ఎందుకు తెలియచేయలేదు అంటూ కొందరు సోషల్ మీడియాలో ఆమె మౌనం వెనుక ఏదో అర్థం ఉంది అంటూ సరికొత్త ఊహాగానాలు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఆమెకు జాతక రీత్యా సరిగ్గా గ్రహాలు లేవు అంటూ కొందరు ఆమె జాతకం పై విశ్లేషణలు చేస్తున్న పరిస్థితులలో ఆమెకు గురూజీ గా ప్రోత్సాహిస్తున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రోత్సాహంతో ఆమెకు మళ్ళీ గోల్డెన్ పీరియడ్ వచ్చే ఆస్కారం ఉంది అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: