సాహో లో చేసిన తప్పే OG లో సుజిత్ చేస్తున్నారా..!!
మళ్లీ పవన్ కళ్యాణ్ తో కలిసి డైరెక్టర్ సుజిత్ OG చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఇందులో కూడా నటీనటులను సైతం ఈ సినిమా కోసం తీసుకువస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానుల సైతం మళ్లీ ఇదే తప్పు చేస్తున్నారా అన్నట్టుగా కామెంట్లు చేయడం జరుగుతోంది. ఇప్పటికీ ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి అయ్యే దశలో చేరుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ నటీనటులు సైతం ఇందులో నటిస్తూ ఉండడం గమనార్హం. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు.
ఇటీవలే పవన్ కళ్యాణ్ మూడవ షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తోంది ముఖ్యంగా రాజకీయాలలో వారాహి టూర్ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్గా ప్రియాంక మోహన్ నటిస్తున్నది.. అలాగే తమిళం నుండి అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి నటిస్తూ ఉన్నారు. అన్ని భాషలలో ఒకే టైటిల్ తో విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబర్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్లో విడుదల చేసే విధంగా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా అంతమంది నటీనటులను పెట్టి og సినిమాని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ సుజిత్ సాహో సినిమా లాగా చేస్తారా లేకపోతే పవన్ కు సక్సెస్ ఇస్తారా చూడాలి మరి.