ప్రభాస్ ని ఢీకొట్టే పాత్రలో కమల్ హాసన్..!!
గత కొద్దిరోజులుగా ఈ చిత్రం లో దిగ్గజ నటుడైన కమలహాసన్ ప్రభాస్ తో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్ట్-K లో కమల్ హాసన్ విలన్ పాత్రలో చేయడానికి ఓకే చెప్పినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఆగస్టు నెలలో ఈ సినిమా షూటింగ్ కి డేట్లు ఇచ్చినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. కేవలం 30 రోజుల డేట్లకు రూ.75 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఇదే జరిగితే ఈ సినిమా అతిపెద్ద మల్టీస్టారర్ చిత్రంగా పేరు పొందుతుందని అభిమానులు భావిస్తూ ఉన్నారు.
ప్రాజెక్ట్-K చిత్రం ఇప్పటికే 70% వరకు సినిమా షూటింగ్ పూర్తి అయ్యిందని ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంది చిత్ర బృందం.అయితే ఇటీవల ఈ సినిమా వాయిదా పడుతోందని వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి.. కానీ ఈ సినిమా పైన ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు చిత్ర బృందం. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కమలహాసన్ నటిస్తున్నారని తెలిసి ఈ సినిమాకు మరింత హైప్ పెరిగిపోయింది. మరి చిత్ర బృందం కమల్ హాసన్ నటిస్తున్న పాత్ర పైన క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.