రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సిరీస్ మూవీ ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాహుబలి మూవీ తో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న ప్రభాస్ ఆ తర్వాత నుండి అదే రేంజ్ సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే సాహో ... రాధే శ్యామ్ వంటి రెండు భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లతో ప్రభాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాకపోతే ఈ రెండు సినిమాలు కూడా బాహుబలి రేంజ్ విజయాలను మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేదు.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో ఆది పురుష్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా ... ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ జూన్ 16 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల కాబోతోంది. ఈ మూవీ పై దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఈ మూవీ పై రెండు తెలుగు రాష్ట్రాల సినీ ప్రేమికులు తారా స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు.
దానితో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ మొత్తంలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దానితో ఈ మూవీ భారీ టార్గెట్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగబోతుంది. ఈ మూవీ భారీ మొత్తంలో కనెక్షన్ లను రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబట్టినట్లు అయితేనే బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించే అవకాశాలు ఉన్నాయి.