పెళ్లికి రెడీ అయిన రామ్ పోతినేని.. అమ్మాయి ఎవరో తెలుసా..?

Anilkumar
ఈమధ్య టాలీవుడ్ యంగ్ హీరోలంతా తమ బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బాయ్ చెప్పి పెళ్లి చేసుకుంటున్నారు. గత వారం యంగ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోగా.. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు వారి బాటలోనే మరో యంగ్ హీరో కూడా వెళ్తున్నాడు. త్వరలోనే ఆ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు మన ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని. ఈ హీరో త్వరలోనే పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడు కాబోతున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ గా మారుతున్నాయి. రామ్ పోతినేని కి కాబోయే భార్య కూడా ఓ బడా వ్యాపారవేత్త కూతురు అని తెలుస్తోంది. 


హైదరాబాద్ కు చెందిన ఆ వ్యాపారవేత్త కూతురిని రామ్ పెళ్లి చేసుకోబోతున్నడట. అంతేకాదు వరుణ్ తేజ్ లాగానే రామ్ కూడా తన పెళ్లి విషయంలో సీక్రెట్ మైంటైన్ చేస్తున్నాడని అంటున్నారు. ఇప్పటికే ఇరువురి కుటుంబాల మధ్య చర్చలు కూడా జరిగాయట. అయితే త్వరలోనే ఈ విషయం గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం. ఇక ఈ వార్త తెలిసిన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంతేకాదు ఎప్పుడెప్పుడు ఆ అమ్మాయిని చూస్తామా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం రామ్ పోతినేని మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు 'RAPO19' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.


ఇటీవల రామ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ అయిపోయాకే రామ్ పోతినేని పెళ్లి చేసుకుంటాడని సమాచారం. పెళ్లి కారణంగానే బోయపాటి తరువాత రామ్ మరో సినిమాను ప్రకటించలేదని తెలుస్తోంది. ఇక ఆఖండ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బోయపాటి శ్రీను తో రామ్ పోతినేని చేస్తున్న మొదటి సినిమా ఇది. దీంతో ఈ ప్రాజెక్టుపై ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ సినిమాని భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. రామ్ సరసన శ్రీ లీల హీరోయిన్గా నటిస్తుండగా.. ఎస్, ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 20న విడుదల చేయనున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: