నందమూరి నట సింహం బాలకృష్ణ ఈ సంవత్సరం ఇప్పటికే వీర సింహా రెడ్డి మూవీ తో బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఇలా ఈ సంవత్సరం ఇప్పటికే ఒక అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న "భగవంతు కేసరి" అనే పవర్ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... శ్రీ లీల ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతుంది.
తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ నుండి టీజర్ ను ఈ చిత్ర బృందం తాజాగా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసింది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి అదిరిపోయే సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత బాలకృష్ణ ... బాబీ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 109 వ మూవీ గా రూపొందబోతుంది. అలాగే బాబి ... బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ ని వచ్చే సంవత్సరం ప్రారంభంలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. కాకపోతే ఈ మూవీకి ఎవరు సంగీతం అందించబోతున్నారు అనే విషయాన్ని మాత్రం ఈ మూవీ బృందం ప్రకటించలేదు.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... బాలకృష్ణ ... బాబీ కాంబినేషన్ లో రూపొందిపోయే మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నాయి అని అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే బయటికి రాబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.