రామ్ చరణ్... సుకుమార్ కాంబినేషన్ మూవీపై క్రేజీ అప్డేట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చరణ్ ... శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే పూర్తి కాబోతోంది.

ఈ మూవీ తర్వాత చరణ్ "ఉప్పెన" మూవీ తో దర్శకుడుగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రూపొందిపోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే వెలువడింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ తర్వాత చరణ్ టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోయే మూవీ లో హీరో గా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇది వరకే చరణ్ ... సుకుమార్ కాంబినేషన్ లో రంగస్థలం అనే మూవీ రూపొందింది. ఈ మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీ లోని చరణ్ నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలాగే ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి సుకుమార్ కు అదిరిపోయే రేంజ్ లో ప్రశంసలు లభించాయి.

అలా ఇప్పటికే వీరి కాంబినేషన్ లో రూపొందిన రంగస్థలం మూవీ భారీ బ్లాక్ బాస్టర్ విజయం సాధించడంతో వీరి కాంబినేషన్ లో రూపొందబోయే తదుపరి మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం చరణ్ ... సుకుమార్ కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం సమ్మర్ లో ప్రారంభం కాబోతున్నట్లు ... 2025 వ సంవత్సరం సంక్రాంతి కానుకగా ఈ మూవీ ని విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: