ఆదిపురుష్ ధియేటర్ లో హనుమంతుడు సీట్ పై కామెంట్స్ !

Seetha Sailaja
సినిమా ప్రమోషన్ లో రకరకాల పద్దతులు ఉపయోగిస్తున్నారు. ఈవిషయంలో మరొక అడుగు ముందుకు వేసి ‘ఆదిపురుష్’ ధియేటర్ లో ఒక సీట్ ఖాళీగా ఉంచుదామని ఆసేట్ లో హనుమంతుడు వచ్చి కూర్చుని ప్రేక్షకులతో పాటు సినిమాను చూసి హనుమాన్ కూడ ‘ఆదిపురుష్’ మూవీని ఎంజాయ్ చేస్తారు అంటూ ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఈమూవీ నిర్మాతలు మొదలుపెట్టిన కొత్త పబ్లిసిటీ ఎత్తుగడ పై సోషల్ మీడియాలో కొందరు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
 
 
ఈ వార్తను తెలుసుకున్న కొందరు ‘ఆదిపురుష్’ మూవీ నిర్మాతల ప్రకటన పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. సినిమా బాగుంటే పర్వాలేదు కాని ఒకవేళ అనుకోకుండా ఈమూవీ ఫెయిల్ అయి మూడు రోజులు తరువాత ధియేటర్లు ఖాళీ అయితే ఖాళీగా ఉన్న చాల సీట్స్ లో ఏకుర్చీలో హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు అంటూ కొందరు సోషల్ మీడియాలో జోక్ చేస్తున్నారు.
 
 
 మరికొందరైతే హనుమంతుడు ధియేటర్లలో కూర్చుని ఉంటాడు కాబట్టి చెప్పులు వేసుకుని ధియేటర్లలో ఎలా కూర్చోవాలి అంటూ ప్రశ్నించడమే కాకుండా ధియేటర్ బయట వదిలిపెట్టి  వెళ్ళే తమ ఖరీదైన చెప్పులకు ధియేటర్ యాజమాన్యాలు బద్రత కల్పిస్తాయ అంటూ కొందరు ప్రశ్నలు వేస్తున్నారు. ఇది చాలదు అన్నట్లుగా మరికొందరు మరో ట్విస్ట్ ఇచ్చి హనుమంతుడు ధియేటర్ లో కూర్చుంటాడు కాబట్టి ఇంట్రవెల్ సమయంలో పాప్ కార్న్ బదులు పాయసాలు అప్పాలు అమ్మితే బాగుంటుంది అంటూ సూచనలు చేస్తున్నారు.
 
 
ఇలా రకరకాల సెటైర్లు సోషల్ మీడియాలో కనిపించడంతో ‘ఆదిపురుష్’ యూనిట్ మొదలుపెట్టిన వెరైటీ పబ్లిసిటీ ఆదిలోనే గాడితప్పిందా అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి గొప్పవ్యక్తిని అయినా టార్గెట్ చేసే వ్యక్తులు ఎందరో ఉన్న నేపధ్యంలో హనుమంతుడు కి ప్రత్యేకమైన చైర్ ఎంతవరకు సమంజసం అంటూ ఈమూవీ నిర్మాతలతో పాటు ఓం రౌత్ ని అదేవిధంగా ప్రభాస్ ని టార్గెట్ చేస్తూ కొందరు ఈమూవీ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: