రామ్ బోయపాటి మూవీ షూటింగ్ అప్డేట్?

Purushottham Vinay
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సినిమా షూటింగ్ క్లైమాక్స్ కు చేరుకుంది. తాజాగా ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ను మైసూర్ లో స్టార్ట్ చేశారు.15వ తేదీ వరకు ఈ షెడ్యూల్ నడుస్తుంది. ఇందులో ఓ యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఇంకా ఓ సాంగ్ ను కూడా పిక్చరైజ్ చేస్తారు. ఈ పాట షూటింగ్ కోసం ఆల్రెడీ రామ్, శ్రీలీల మైసూర్ లో ల్యాండ్ అయ్యారు.ఓ మంచి లొకేషన్ లో కలుస్తున్నామంటూ రామ్ తో దిగిన సెల్ఫీని శ్రీలీల సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతుంది.ఇక ఈ కొత్త షెడ్యూల్ తో టోటల్ టాకీ పూర్తవుతుంది. ఒకే ఒక్క సాంగ్ మాత్రం పెండింగ్ ఉంటుంది.ఆ సాంగ్ ని హైదరాబాద్ లో సెట్ వేసి పూర్తి చేస్తారు. ఈ గ్యాప్ లో ఈ సినిమా టైటిల్ ను కూడా ప్రకటిస్తారు. ఈ సినిమా కోసం 2-3 టైటిల్స్ అనుకున్నారు.అయితే తాజా సమాచారం ప్రకారం, ఓ సూపర్ టైటిల్ ను లాక్ చేసినట్టు సమాచారం తెలుస్తోంది.ఓ మంచి టైమ్ చూసి ఆ టైటిల్ ని రిలీజ్ చేయనున్నారు.


ఇక రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించి హైదరాబాద్ లో ఓ భారీ షెడ్యూల్ ని పూర్తిచేశారు.ఇందులో కేవలం ఒకే ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసం ఏకంగా 24 రోజుల పాటు షూట్ చేశారు. దీనిపై ఈ సినిమా హీరో రామ్ కూడా స్పందించడం జరిగింది. చాలా బాగా వచ్చిందంటూ ఆయన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశాడు.టాలీవుడ్ బిజీఎస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.ఇంకా అలాగే జీ స్టూడియోస్ సంస్థ ఈ సినిమాలో పెట్టుబడులు పెట్టగా..స్టార్ మా సంస్థ శాటిలైట్ రైట్స్ ని దక్కించుకుంది.రామ్ బర్త్ డే సందర్బంగా రిలీజ్ అయిన మాస్ గ్లింప్స్ కి ఒక రేంజిలో రెస్పాన్స్ వచ్చింది. అది సినిమాపై ఓ రేంజిలో అంచనాలని పెంచేసింది. ఖచ్చితంగా ఈ సినిమాతో రామ్ అదిరిపోయే మాస్ హిట్ కొట్టడం ఖాయమని ఆయన అభిమానులు భావిస్తున్నారు. మరి చూడాలి రామ్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ ని దక్కించుకుంటాడో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: