మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ 'గుంటూరు కారం'. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ కి జోడిగా పూజ హెగ్డే, శ్రీ లీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. గతంలో మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో అతడు, ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా నుంచి టైటిల్ తో పాటు టీజర్ గ్లింప్స్ ని విడుదల చేయగా..
తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో ఆల్ టైం రికార్డ్ ని క్రియేట్ చేసింది. టీజర్ విడుదలైన 24 గంటల్లోనే ఏకంగా 25 మిలియన్ల వ్యూస్ ను రాబట్టి పుష్ప2 రికార్డ్స్ ని బీట్ చేసింది. దాంతో టాలీవుడ్ లోనే హైయెస్ట్ వ్యూస్ అందుకున్న టీజర్ గా నిలిచింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ టీజర్ మరో మైలురాయిని చేరుకుంది. తాజాగా ఈ టీజర్ ఏకంగా 30 మిలియన్ల వ్యూస్ ని రాబట్టి టాలీవుడ్ లోనే ఆల్ టైం రికార్డును క్రియేట్ చేసింది. గుంటూరు కారం టీజర్ తో టాలీవుడ్ లోనే 30 మిలియన్ల వ్యూస్ అందుకున్న ఫస్ట్ ఎవర్ హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఆల్ టైం రికార్డ్ ని అందుకున్నాడు. దీంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
అయితే ఈ టీజర్ కి వ్యూస్ అయితే రికార్డు స్థాయిలో వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం అంతగా రావడం లేదు. ఈ విషయంలోనే మహేష్ బాబు ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అవుతున్నారు. ఇక షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు మహేష్ బాబు. ఎందుకంటే నెక్స్ట్ దర్శక ధీరుడు ఎస్ రాజమౌళితో పాన్ వరల్డ్ స్థాయిలో యాక్షన్ అడ్వెంచర్స్ డ్రామా చేస్తున్నాడు. ఇప్పటినుంచే ఈ ప్రాజెక్టు కోసం మహేష్ కసరత్తులు చేస్తున్నాడు. ఇక ఈ ఏడాది చివర్లోనే మహేష్ - రాజమౌళి ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా గుంటూరు కారం సినిమా విడుదల కానుండగా.. ఆ తర్వాత నుంచి పూర్తిగా రాజమౌళి సినిమా పైనే మహేష్ ఫోకస్ చేయనున్నాడు...!!