నయనతార గ్లామర్ సీక్రెట్ ఏంటో తెలుసా..!?

Anilkumar
ఎక్కడో కేరళ రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి ..ఎన్నో అవమానాలను.. విమర్శలను ఎదుర్కొని నటిగా ఎదిగి.. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్న నయనతార గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. దక్షిణాదిసిన ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో నయనతార ముందు వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. నాలుగు పదుల వయసులో కూడా ఇప్పటికీ అదే ఫిట్నెస్ తో దూసుకుపోతోంది ఈ స్టార్ హీరోయిన్ .పెళ్లి చేసుకుని ఇద్దరు కవల పిల్లలకు సరోగసి పద్ధతి ద్వారా తల్లి అయినప్పటికీ అదే జోరుతో వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. 

తన అందంతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఈమె. అయితే ఇలాంటి ఒక స్టార్ హీరోయిన్ ఇంత ఫిట్గా ఇంత అందంగా ఉండడానికి గల కారణం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే నయనతార బరువు తగ్గడానికి ఫిట్ గా ఉండడానికి కారణం కేవలం జిమ్ వర్కౌట్స్ మరియు యోగాలే అని అంటున్నారు. ముఖ్యంగా ఆమె ఇంత ఫిట్గా ఉండడానికి యోగ బాగా ఉపయోగ పడిందట .నిత్యం నయనతార రెండు గంటలు కచ్చితంగా యోగా చేస్తుండట .అంతేకాదు డైట్ ప్లానింగ్ లో కచ్చితంగా రోజు కొబ్బరినీళ్లు తాగుతుండట నయనతార. 

ఉదయం అల్పాహారంలో పళ్ళ రసం తప్పనిసరిగా తీసుకుంటుందట. 
పళ్ళరసం బరువును తగ్గించడంతోపాటు ఎనర్జీ పెంచడానికి సహకరిస్తుంది. మధ్యాహ్నం భోజనంలో నాన్ వెజ్ గుడ్డు, కూరగాయలు సమానంగా తీసుకుంటుంది నయనతార. ముఖ్యంగా ఆమె తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ కలిగిన పదార్థాలను దూరంగా పెడుతుండటం నయనతార. అంతేకాదు రోజుకు ఖచ్చితంగా ఎనిమిది గంటలను నిద్ర పోతుందట నయనతార. నిద్ర సమయాన్ని మాత్రం తప్పకుండా పాటిస్తున్న ఆమె మంచి నిద్ర వల్ల కూడా బరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటూ చెబుతోంది నయనతార.ప్రస్తుతం నయనతార షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తోంది.!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: