ఆ తేదీన జపాన్లో "కేజిఎఫ్ చాప్టర్ 1" "చాప్టర్ 2" మూవీలు విడుదల..!

Pulgam Srinivas
కన్నడ సినిమా ఇండస్ట్రీ.లో మంచి గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటు వంటి యాష్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన "కే జీ ఎఫ్ చాప్టర్ 1" "చాప్టర్ 2" మూవీ లు ఏ రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాయో మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కి రవి బుస్రుర్ సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క మొదటి భాగం పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యి అద్భుతమైన భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఈ మూవీ రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు పెరిగి పోయాయి.

అలా భారీ అంచనాల నడుమ విడుదల అయినటువంటి ఈ మూవీ రెండవ భాగం ప్రేక్షకుల అంచనాను అందుకొని భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ లను కూడా రాబట్టింది. ఈ మూవీ రెండవ భాగంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన రెండు భాగాలు విడుదల అయ్యి చాలా కాలం అవుతుంది.

ఇలా ఇప్పటికే విడుదల అయ్యే చాలా రోజులు అవుతున్న తర్వాత ఈ సినిమాను ఈ మూవీ మేకర్స్ జపాన్ లో విడుదల చేయనున్నారు. ఈ మూవీ యొక్క రెండు భాగాలను జపాన్ లో ఈ మూవీ మేకర్స్ ఓకే రోజు విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని జపాన్ లో జూలై 14 వ తేదీన ఈ మూవీ బృందం విడుదల చేయబోతుంది. మరి ఈ మూవీ కి జపాన్ ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: