"మేము ఫేమస్" మూవీ కలెక్షన్స్ ను అఫీషియల్ గా ప్రకటించిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
ఈ మధ్య కాలంలో ఎంతో మంది నటీనటులు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఇప్పటికే కొంత మంది సక్సెస్ అయ్యి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి స్థానంలో కొనసాగుతున్నారు. ఇలా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని తాజాగా కూడా ఒక నటుడు వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఆ నటుడే సుమంత్ ప్రభాస్. ఈ నటుడు యూట్యూబ్ వీడియోల ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. తాజాగా ఇతను మేము ఫేమస్ అనే సినిమాలో హీరోగా నటించాడు.
 

ఈ మూవీ లో ఇతను హీరోగా నటించడం మాత్రమే కాకుండా ... ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఇదే ఈ నటుడికి మొట్ట మొదటి సినిమా. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి డీసెంట్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పది రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకోండి.

ఈ పది రోజుల్లో కూడా ఈ సినిమా డీసెంట్ కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ లకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా పది రోజుల్లో 6.1 ప్లస్ కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: