ఆ సినిమా కోసం చికెన్ మానేసిన అల్లు అర్జున్..!?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ తో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఇక పుష్ప సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా అల్లు అర్జున్ ఈ సినిమాలో తన నటనతో ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన షూటింగ్ పనిలో బిజీ అయ్యాడు అల్లు అర్జున్. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లో పోస్టర్ విడుదలైంది అందులో అల్లు అర్జున్ గెటప్ లో చాలా భయంకరంగా కనిపించి అందరిని షాప్ కి గురి చేశారు. 

అయితే అల్లు అర్జున్ వేసుకున్న ఈ గెటప్ చూస్తే సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు. సినిమాలపై ఉన్న ఇష్టంతో ఆ సినిమాలోని తన పాత్ర కోసం 100% న్యాయం చేయడానికి ఏమాత్రం వినకడుగు వేయడు అల్లు అర్జున్ .ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అది ఏంటంటే గతంలో అల్లు అర్జున్ నటించిన ఒక సినిమా షూటింగ్ సమయంలో భాగంగా ఆ సినిమా షూటింగ్ పూర్తయ్యేంతవరకు చికెన్ ముట్టుకోకుండా తినకుండా ఆ సినిమా షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేశారట అల్లు అర్జున్. ఇలా నాన్ వెజ్ తినకుండా అల్లు అర్జున్ నటించిన సినిమా విషయానికి వస్తే..

డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దువ్వాడ జగన్నాథం సినిమా అన్నమాట. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక బ్రాహ్మణుడి కుర్రాడి పాత్రలో నటించిన సంగతి  అందరికీ తెలిసిందే .బ్రాహ్మణుడు నాన్ వెజ్ తినకూడదు కాబట్టి ఆ పాత్రలో నటించినన్ని రోజులు అల్లు అర్జున్ కూడా ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యే వరకు చికెన్ తినలేదట.ఇలా అల్లు అర్జున్ బ్రాహ్మణులను గౌరవిస్తూ చికెన్ తినకుండా షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశారట. కేవలం పాత్రలో నటించినందుకే అల్లు అర్జున్ దూరం పెట్టడంతో ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. అంతేకాదు ఈ వార్త విన్న అల్లు అర్జున్ అభిమానులు అల్లు అర్జున్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: