కొడుకు పెళ్లి వార్తలపై స్పందించను అంటున్న నాగ బాబు..!!

murali krishna
వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి కాంబినేషన్ లో రెండు సినిమాలు వచ్చాయి.ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను మాత్రం అందుకోలేదనే విషయం తెలిసిందే.
ఈ సినిమాలు ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయినా ఈ సినిమాల వల్లే వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ప్రేమలో పడ్డారని ప్రచారం అయితే జరిగింది. అయితే వైరల్ అవుతున్న ఈ వార్తల గురించి అటు లావణ్య కానీ ఇటు వరుణ్ తేజ్ కానీ అస్సలు స్పందించలేదు. అయితే ఈ నెల 9వ తేదీన వరుణ్ తేజ్,లావణ్యలకు నిశ్చితార్థం జరగనుందని వార్తలు కూడా ప్రచారంలోకి వస్తున్నాయి.

ఈ వార్తల గురించి మెగా ఫ్యామిలీ నుంచి అధికారికంగా ధృవీకరణ అయితే రాలేదు. అయితే వరుణ్ లావణ్య పెళ్లి వార్తల గురించి స్పందించాలని కోరగా నాగబాబు షాకింగ్ కామెంట్లు కూడా చేశారు. వరుణ్ తేజ్ పెళ్లి వార్తల గురించి నేను ఇప్పుడు మాట్లాడటం కరెక్ట్ కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వరుణ్ తేజ్ పెళ్లి గురించి త్వరలోనే ప్రకటన చేస్తామని కూడా ఆయన తెలిపారు. వరుణ్ తేజ్ పెళ్లి ఎవరితో అనే ప్రశ్న గురించి నేను ఎలాంటి కామెంట్ కూడా చేయనని త్వరలో వరుణ్ తేజ్ ఆ విషయాలను వెల్లడిస్తారని నాగబాబు తెలిపారు.
 
మరోవైపు వరుణ్ తేజ్ మాత్రం పిజ్జా తింటూ గవ్వలను ప్రిపేర్ చేస్తూ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. పెళ్లికి ముందే వంటలు నేర్చుకుంటున్నావా బ్రో అంటూ కొంతమంది వరుణ్ తేజ్ ఫోటోల గురించి సరదాగా కామెంట్ చేస్తున్నారు.. వరుణ్ తేజ్ కెరీర్ విషయానికి వస్తే ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కుతోందని తెలుస్తుంది.ఈ సినిమాతో అటు వరుణ్ తేజ్ ఇటు ప్రవీణ్ సత్తారు విజయం సాధించాల్సి ఉంది. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: