బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్.. మెగాస్టార్ Vs సూపర్ స్టార్..?

Anilkumar
ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగారు. ఇక ఈ ఫైట్ లో ఇద్దరూ గెలిచారని చెప్పాలి. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి రెండు సినిమాలను ప్రేక్షకులు బాగా ఆదరించారు. చాలా రోజుల తర్వాత వాల్తేరు వీరయ్య లో మెగాస్టార్ తన వింటేజ్ స్టైల్ చూపిస్తే బాలయ్య వీర సింహారెడ్డి తో మరోసారి తను తన ఫ్యాక్షన్ తో అదరగొట్టాడు. దీంతో సంక్రాంతి సీజన్ లో ఇద్దరు హీరోల సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు మరోసారి ఇద్దరు సీనియర్ హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద వార్ కి దిగుతున్నారు. ఆ సీనియర్ హీరోలు మరెవరో కాదు ఒకరేమో మెగాస్టార్ చిరంజీవి, 

మరొకరేమో సూపర్ స్టార్ రజనీకాంత్. మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ 'భోళాశంకర్' ఆగస్టు 11న రిలీజ్ కానుంది. తమిళంలో హిట్ అయిన వేదాలం మూవీకి అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మెహర్ రమేష్ మీద నమ్మకం లేకపోయినా ఇప్పటి వరకు రిలీజ్ అయిన పోస్టర్స్ చూస్తే మంచి పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ఇక రిలీజ్ డేట్ ని లాక్ చేసి ప్రమోషన్స్ మొదలు పెడుతున్న సమయంలోనే మెగాస్టార్ కి పోటీగా ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ రేసులోకి వచ్చాడు. మెగాస్టార్ కన్నా ఒక్కరోజు ముందు అంటే ఆగస్టు 10న సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు.

తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా షూటింగ్ పూర్తి చేసిన మూవీ యూనిట్ ఆగస్టు 10న కలుద్దామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. షూటింగ్ పూర్తి అయిన సందర్భంగా సెట్స్ ల్ మూవీ యూనిట్ అంతా సెలబ్రేషన్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ జైలర్ గా కనిపించనున్న ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్, మలయాళ అగ్ర నటుడు మోహన్లాల్ పలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై సౌత్ లో భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులో ఈ మూవీ థియేటర్ రైట్స్ ని ఏషియన్ సినిమా సొంతం చేసుకుంది. కాబట్టి కచ్చితంగా తెలుగులో కూడా జైలర్ కి భారీగా థియేటర్స్ దక్కే అవకాశం ఉంది. కేవలం ఒక్కరోజు గ్యాప్ తోనే బాక్సాఫీస్ వార్ కి దిగుతున్న చిరంజీవి, రజనీకాంత్ ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారనేది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: