3 రోజుల్లో 2018 మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు ఇవే..!

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితం మలయాళం లో విడుదల అయిన 2018 అనే మూవీ అక్కడ అద్భుతమైన విజయాన్ని సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మలయాళ సినిమా ఇండస్ట్రీ లో ఇప్పటికే అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ ఇప్పటి వరకు ఏ మలయాళ సినిమా కలెక్ట్ చేయని రేంజ్ లో కలెక్షన్ లను వసూలు చేసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఇప్పటికే మలయాళం లో బ్లాక్ బాస్టర్ అవడంతో తాజాగా ఈ సినిమాను తెలుగు లో కూడా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేశారు. ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి అంచనాల నడుమ విడుదల అయింది.

 తెలుగు లో కూడా మంచి అంచనాల నడుమ విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ సాలిడ్ కలెక్షన్ లు లభిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 4 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ 4 రోజుల్లో ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలక్షన్ ల వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ 4 రోజుల్లో నైజాం ఏరియాలో 2.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేయగా , ఏపీ మరియు సీడెడ్ ఏరియాలో 2.84 కలెక్షన్ లను వసూలు చేసింది.

మొత్తంగా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల్లో 2.46 కోట్ల షేర్ ... 5.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇది ఇలా ఉంటే మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ కి 1.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ ఇప్పటికే 46 లక్షల లాభాలను రెండు తెలుగు రాష్ట్రాల్లో అందుకొని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: