"నేను స్టూడెంట్ సర్" మూవీ నుండి "రన్ రన్" సాంగ్ విడుదల తేదీని ప్రకటించిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి మూవీ స్వాతి ముత్యం తో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటు వంటి బెల్లంకొండ గణేష్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ హీరో స్వాతి ముత్యం మూవీ లో తన నటన తో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకున్నాడు. ఈ మూవీ థియేటర్ లలో మంచి విజయం అందుకుంది. అలాగే ఆ తర్వాత "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ లో కూడా ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.
 

ఇలా స్వాతి ముత్యం మూవీ తో తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈ యువ హీరో తాజాగా నేను స్టూడెంట్ సర్ అనే యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో సముద్ర ఖని ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ... నంది సతీష్ వర్మ ఈ మూవీnని నిర్మించాడు. రాఖీ ఉప్పలపాటి ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను జూన్ 2 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ బృందం విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ లోని "రన్ రన్" అంటూ సాగే లిరికల్ సాంగ్ ను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ బృందం విడుదల చేసిన ఈ పోస్టర్ లో గణేష్ పరిగెడుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ మూవీ తో గణేష్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే జూన్ 2 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: