ప్రభాస్ ఆదిపురుష్ సినిమా రెమ్యూనరేషన్ ఏం చేసాడో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.అయితే  కేవలం సినిమాలే కాకుండా ఆయన ఉదార స్వభావం తోటి హీరోలతో ఆయనకున్న మంచి స్నేహం వల్ల ప్రభాస్ ని అందరూ ఇష్టపడుతూ ఉంటారు.అయితే ప్రభాస్ ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించాడు. ఇక అలా సినిమాల ద్వారా సంపాదించిన దాంట్లో ఎంతో కొంత అనాధ పిల్లలకు సహాయపడుతూ వస్తున్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక ఇలాంటి విషయాలను ఆయన ఎప్పుడూ బయటకు చెప్పుకోరు. 

మూడో కంటికి కూడా తెలియకుండా చాలామందికి సహాయపడుతూ ఉంటాడు ప్రభాస్.ఆయన సన్నిహితులు ఎవరో ఒకరు ఇలాంటి విషయాలని బయట పెడితే తప్ప ఈ విషయాలు వెలుగులోకి రావు. ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి ఎవరికి తెలియదు. అయితే తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న అదిపురుష్ సినిమా వచ్చేనెల 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కోసం సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమా కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్ లో 80% ఒక అనాధ ఆశ్రమానికి విరాళంగా ఇచ్చినట్లుగా తాజాగా వార్తలు వినబడుతున్నాయి.

అయితే ఈ సినిమాలో నటించినందుకు ప్రభాస్ 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని తెలుస్తోంది. అంటే ఆయన 80 కోట్ల రూపాయల డబ్బును అనాధాశ్రమానికి విరాళంగా ఇచ్చారట. ఇక ఇంత భారీ మొత్తంలో అనాధ పిల్లలకు విరాళం ఇచ్చిన టాలీవుడ్ హీరో ఇప్పటివరకు ఒక్కరు కూడా లేరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒక లక్ష రూపాయలు విరాళం ఇవ్వాలంటే వందసార్లు ఆలోచించే ఈ రోజుల్లో అన్ని కోట్లు లెక్కచేయకుండా ఆ అనాధాశ్రమానికి విరాళంగా ఇచ్చాడు మన ప్రభాస్. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు ప్రభాస్ మనసు ఎంత మంచిదో. అయితే ప్రస్తుతం  ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: