వైరల్ అవుతున్న ఎన్టీఆర్ లేటెస్ట్ పిక్..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఎన్టీఆర్ ఆఖరుగా "ఆర్ ఆర్ ఆర్" అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ఎన్టీఆర్ తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హీరో గా నటించాడు. ఈ మూవీ కి దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. అలాగే ఈ మూవీ కి ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు కూడా లభించాయి.
 

దానితో ఈ మూవీ ద్వారా ఎన్టీఆర్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ప్రస్తుతం ఈ నటుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.  జాన్వి కపూర్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ కి రత్న వేలు సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేస్తున్నాడు. ఈ మూవీ పై ఎన్టీఆర్ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల్లో కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ కు సంబంధించి వైరల్ అవుతున్న ఈ ఫోటోలో ఎన్టీఆర్ జిమ్ లో ఉన్నాడు. అలాగే తన దేవర సినిమాలో అద్భుతమైన బాడీ లో కనబడడం కోసం ఎన్టీఆర్ జిమ్ లో కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: