తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్ తో మరో మూవీ చేయబోతున్న రానా..?

Pulgam Srinivas
తనుకు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ హీరో టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన లీడర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్ విజయాన్ని సాధించకపోయినప్పటికీ ఈ మూవీ లోని రానా నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

ఈ మూవీ తర్వాత రానా పలు మూవీ లలో హీరో గా నటించినప్పటికీ రానా కు సోలో హీరోగా మాత్రం మంచి విజయాలు దక్కలేదు. ఇది ఇలా ఉంటే రానా తన కెరీర్ లో సోలో హీరోగా అద్భుతమైన విజయాన్ని అందుకుంది "నేనే రాజు నేనే మంత్రి" మూవీ తో. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా ... తేజ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ లో పొలిటికల్ లీడర్ పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన రానా ఈ మూవీ తర్వాత కూడా సోలోగా కొన్ని సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ఆ మూవీ లు కూడా మంచి విజయాలను అందుకోలేదు.

ఇది ఇలా ఉంటే తనకు బాక్స్ ఆఫీస్ దగ్గర సోలోగా అద్భుతమైన విజయాన్ని అందించిన తేజ దర్శకత్వంలో రానా మరో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... తాజాగా దర్శకుడు తేజ ... రానా కు ఒక కథను వినిపించాడట. ఆ కథ ఈ హీరోకు అద్భుతంగా నచ్చడంతో వెంటనే తేజ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ మూవీ ని ఆచంట గోపీనాథ్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని వివరాలు మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: