4 వేల కోట్ల బిజినెస్ చేస్తున్న ప్రభాస్..!?

Anilkumar
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆది పురుష్ ,సలార్, ప్రాజెక్ట్ కే వంటి సినిమాలపై ఏ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక ఈ మూడు సినిమాలతో ప్రభాస్ వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకుంటాడని భావిస్తున్నారు ఆయన అభిమానులు. ఇక ప్రభాస్ మారుతి కాంబినేషన్లో రానున్న సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. బాహుబలి బాహుబలి 2 సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప్రభాస్ వరుసగా నటిస్తున్న ఈ నాలుగు సినిమాలకి 4000 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది. 


అయితే గత సినిమాలో ఫలితంతో సంబంధం లేకుండా ప్రభాస్ నటిస్తున్న సినిమాలకు బిజినెస్ జరుగుతోంది. ప్రస్తుతం మారుతి ప్రభాస్ కాంబినేషన్లో సినిమాకి సంబంధించి రాజా డీలక్స్ అనే టైటిల్ను అనుకుంటున్నారు. అయితే ప్రభాస్ సినిమాల బడ్జెట్ తో పోలిస్తే రెట్టింపు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది.ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆది పురుష్ సినిమాకి 800 నుండి 1000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందట. కాగా సలార్ సినిమాకి 350 కోట్ల రూపాయలతో పెరకెక్కిస్తుండగా ఈ సినిమాకి 1000కోట్ల స్థాయిలో బిజినెస్ జరుగుతోందని తెలుస్తోంది.


ఈ సినిమాలతో పాటు ప్రభాస్ నాగ అశ్విన్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాకి వేయికోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందని సమాచారం.. ఈ సినిమాతో పాటు మారుతీ ప్రభాస్ కాంబినేషన్లో రాబోయే సినిమాకు 700 నుండి 800 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతోందట. ఇలా వరుస సినిమాలు చేస్తూ పోవడంతో ప్రభాస్ అభిమానుల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. దీంతో ప్రభాస్ సినిమాలకు 4000 కోట్ల రూపాయల రేంజ్ లో బిజినెస్ జరుగుతుండడంతో ఆయన అభిమానులకు సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: