ఫస్ట్ ఇండియన్ అంబాసిడర్ గా బాలీవుడ్ బ్యూటీ..!

Divya
ప్రస్తుత కాలంలో చాలామంది హీరో హీరోయిన్లు గ్లోబల్ స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.  అది కూడా తెలుగు సినిమా పుణ్యమా అని చెప్పాలి ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుందో ఇక అప్పటినుంచి స్టార్ సెలబ్రిటీల పేర్లు ప్రపంచవ్యాప్తంగా మారిమ్రోగిపోతున్నాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ కూడా ఫస్ట్ ఇండియన్ అంబాసిడర్ గా అవకాశం దక్కించుకుంది.. ఈమధ్య కాలంలో రాజమౌళి కారణంగానే ఇండియన్ సినిమాలకు, ఇండియన్ సెలబ్రిటీలకు విపరీతంగా కలిసి వస్తోందని చెప్పవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అంతర్జాతీయ మీడియాలు కూడా మన హీరో హీరోయిన్ల హవాను క్యాష్ చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. ఇకపోతే బిజినెస్ పరంగా కూడా పలు ఇంటర్నేషనల్ సంస్థలు మన ఇండియన్ సెలబ్రిటీల కోసం వెంపర్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మన హీరోలు , హీరోయిన్ల ఇంటర్వ్యూల కోసం వెతుక్కుంటూనే మన సెలబ్రిటీలతో తమ బ్రాంచ్ ని ప్రమోషన్ కూడా చేయించాలనుకుంటున్నాయి పలు ఇంటర్నేషనల్ సంస్థలు. ఈ క్రమంలోని ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ లాంటి స్టార్ట్స్ తో పాటు రీసెంట్గా రష్మిక మందన్న లాంటి వారు కూడా ఇలా విదేశీ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇకపోతే ఇప్పుడు అలియా భట్ కూడా ఈ జాబితాలోకి చేరింది ప్రముఖ కాస్ట్లీ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇంటర్నేషనల్ బ్రాండ్ గూచీ కి ఆలియా భట్ బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయింది. మన ఇండియన్ సెలబ్రిటీలు చాలామంది ఈ కాస్ట్లీ బ్రాండ్ కు సంబంధించిన ఉత్పత్తులనే ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా పలు దేశాలలో డెవలప్ అయిన ఈ బ్రాండ్ తమ సంస్థ నుంచి బ్యాగ్స్, షూస్, దుస్తులు ,వాచెస్,  ఆర్నమెంట్స్ ఇలా అనేక రకాల ఉత్పత్తుల బిసినెస్ జరుగుతోంది . ఇప్పుడు ఈ బ్రాండ్ కి ఆలియా భట్ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం గమనార్హం. ఇక ఆలియా భట్ తో పాటు గూచీ కూడా స్వయంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాల ద్వారా స్పష్టం చేశారు. ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా గూచీ బ్రాండ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీగా అలియా భట్ సెలెక్ట్ అవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: