ఈ మధ్యకాలంలో చాలామంది సినీ సెలబ్రిటీలు చాలా చిన్నచిన్న విషయాలకు గొడవలు పడి మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లుగా ఇప్పుడు ఒక వార్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.సైఫ్ అలీ ఖాన్ మొదట్లో పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి కరీనాకపూర్ తో డేటింగ్ చేశాడు. అనంతరం కరీనాకపూర్ ని పెళ్లి చేసుకున్నాడు.వీరి పెళ్లి అప్పట్లో మొత్తం ఇండియాలోనే ఎంత హాట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
పెళ్లి అయిన తర్వాత వీళ్ళిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఇద్దరు బాబులకు కూడా జన్మనిచ్చారు. ఈ దంపతులు ఇక వారిద్దరి కొడుకుల పేర్లు టైమూర్, జహంగీర్ పేరు పెట్టిన తర్వాత ఈ దంపతులు అనేక రకాల వివాదాల్లో ఇరుక్కున్నారు. ప్రస్తుతం ఇద్దరు తమ తమ సినీ కెరీర్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు. ఇక అలాంటి బిజీ జంట తాజాగా ఇప్పుడు విడాకులు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.దీంతో ఈ వార్త విన్న వీరి అభిమానులు అదేంటి విడాకులు తీసుకోవడం ఏంటి అంటూ సందిగ్ధంలో పడ్డారు. ఈ మధ్యకాలంలోనే సెలబ్రిటీలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్న
దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ సినీ క్రిటిక్ ఉమైర్ సందు తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ విధంగా తెలిపారు.. నిన్న రాత్రి కరీనాకపూర్ కి తనతో చాలా దారుణమైన గొడవ జరిగింది అంటూ పేర్కొన్నాడు. ఇక గొడవలో కరీనాకపూర్ తన భర్త మొహంపై తీవ్ర స్థాయిలో దాడి చేసింది అని.. ఊహించని రేంజ్ లో వారిద్దరి మధ్య గొడవ జరిగింది అని చెప్పుకొచ్చాడు..కానీ ఇప్పుడు వారి మధ్య జరిగిన గొడవ గురించి నేను చెప్పడం లేదు అంటూ ఆయన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ ని షేర్ చేయడం జరిగింది.ఇక ప్రస్తుతం ఆయన షేర్ చేసిన పోస్ట్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ విషయంలో నిజమెంత ఉందో అని ఆరాతీస్తున్నారు నటిజన్స్..!!