అలాంటి ప్రశ్నలతో ఇబ్బంది పడుతున్న నిహారిక..!!

Divya
గత కొంతకాలంగా మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొనిదెల వ్యక్తిగత జీవితం గురించి సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.. ముఖ్యంగా తన భర్త నాగచైతన్య నిహారిక మధ్య విభేదాలు వచ్చాయంటూ విడాకులు కూడా తీసుకున్నారంటూ పలు కథనాలు వైరల్ గా మారుతూనే ఉన్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా సమాచారమైతే కుటుంబ సభ్యులు తెలియజేయలేదు. ఇప్పటికీ ఇవన్నీ మీడియా ఊహాగానాలుగా వినిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడంతో పాటు వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను కూడా డిలీట్ చేయడం జరిగింది.

కానీ ఈ వార్తలు నిజమా కాదా అనే విషయంపై ఎవరు క్లారిటీ ఇవ్వలేదు..ఈ వార్తలను ఖండిస్తూ ప్రకటన కూడా చేయలేదు.. ఈ విషయం పూర్తిగా నిహారిక వ్యక్తిగత విషయం కాబట్టి చాలా రహస్యంగా ఉంచినట్లు సమాచారం. అయితే కొంత గ్యాప్ తర్వాత పలు ఓటిటి వెబ్ సిరీస్ లతో నిహారిక తిరిగి తన నటన జీవితాన్ని ప్రారంభించింది. తాజాగా డేట్ ఫిక్స్ఎల్ అనే వెబ్ సిరీస్ లో నిహారిక నటిస్తోంది ఈ సిరీస్ ఈనెల 19వ తేదీన ఓటీటి లో విడుదల కాబోతోంది. ఇప్పటికే ట్రైలర్ ఆసక్తిని పెంచగా ఈ సిరీస్లో గాయత్రి అనే అమ్మాయిగా కనిపించబోతోంది.

ఈ సిరీస్ లో రోషన్ భార్గవ్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా నిహారిక వ్యక్తిగత జీవితం పైన మీడియాలో పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. నిహారిక మాత్రం ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాటేస్తోంది. తన వైవాహిక జీవితం పై నిహారిక పూర్తిగా మౌనం వహించింది అయితే నిహారిక ఇప్పుడు తిరిగి తన జీవిత లక్ష్యాలను సాధించే మార్గంలో బిజీగా ఉన్నది. మరి నిహారిక సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇవ్వడం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: