టిక్ టాక్ దుర్గారావు.. అవకాశాల్లేక ఏం చేస్తున్నాడో తెలుసా?

praveen
అప్పట్లో ఇండియా లో టిక్ టాక్ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంత కాదు అన్న విషయం తెలిసిందే. అప్పటివరకు ఎక్కడ దొరకని వినూత్నమైన ఎంటర్టైర్మెంట్ టిక్ టాక్ లో లభించింది. ఇప్పుడైతే ఇంస్టాగ్రామ్ లో రీల్స్ యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ కనిపిస్తున్నాయి.. కానీ ఒకప్పుడు ఇవేవీ లేనప్పుడు ఇక టిక్ టాక్ లో ఇలాంటి వీడియోలు చూసి తెగ ఎంజాయ్ చేశారు నేటిజన్స్. అంతేకాదు టిక్ టాక్ ద్వారా సెలబ్రెటీల్ గా మారిన వారు కూడా చాలామంది ఉన్నారు.. టిక్ టాక్ అనే యాప్ ద్వారా అందరికీ సుపరిచితులుగా మారి సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్న వారిలో దుర్గారావు దంపతులు కూడా ఉన్నారు అని చెప్పాలి.



 ఇలా టిక్ టాక్ ద్వారా వచ్చిన పాపులారిటీతోనే దుర్గారావు దంపతులు ఎన్నో సినిమాలలో కూడా అవకాశాలు అందుకున్నారు. ముఖ్యంగా వీరిద్దరూ కలిసి చేసిన నాది నకిలీసు గొలుసు అనే పాట ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. ఇక ఆ తర్వాత  కేవలం వెండితెరపైనే కాదు ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు దుర్గారావు దంపతులు. కానీ గత కొన్ని రోజుల నుంచి మాత్రం దుర్గారాజ్ దంపతులు అటు బుల్లితెరపై వెండితెరపై కూడా ఎక్కడా కనిపించడం లేదు.



 అయితే ఇలా అవకాశాలు లేక ఖాళీగా ఉండటంతో ఇక దుర్గారావు దంపతులు ఇద్దరు కూడా సొంతూరుకు వెళ్లి స్థిరపడ్డారట. ఇక ఇప్పుడు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు. ఇక యూట్యూబ్లో వీడియోలను పెట్టడం ద్వారా నెలకు 20 నుంచి 30 వేల వరకు ఆదాయం సంపాదిస్తున్నారట దుర్గారావు దంపతులు. ఒక సొంత ఊరు కి వెళ్లి వ్యవసాయ పనులు కూడా చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారట. ఒకవేళ సినిమాల్లో అవకాశాలు గనుక వస్తే తప్పకుండా ఇండస్ట్రీలో కొనసాగుతామని దుర్గారావు దంపతులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: