పొన్నియన్ సెల్వన్-2 చిత్రం కలెక్షన్లలలో లాభమా . నష్టమా..?
పొన్నియన్ సెల్వన్-1 ప్రపంచవ్యాప్తంగా రూ 400 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు చేయగా..పొన్నియన్ సెల్వన్-2 సినిమా కూడా ఇదే రేంజ్ లో కలెక్షన్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా రూ.170 కోట్లకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా దాదాపుగా రూ.180 కోట్ల రూపాయలు షేర్ కలెక్షన్లు చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు అని చెప్పవచ్చు.పొన్నియన్ సెల్వన్-2 చిత్రం రెండు రోజులలోనే 100 కోట్లకు క్రాస్ కలెక్షన్లు చేసింది.
ఆ తర్వాత కలెక్షన్లు నెమ్మదిగా తగ్గుముఖం పట్టాయి ఇప్పటివరకు పది రోజుల్లో పొన్నియన్ సెల్వన్-2 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల రూపాయలు క్రాస్ వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. అంటే దాదాపుగా రూ .150 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా హిట్ అని చెప్పాలనుకున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకా 30 కోట్ల రూపాయల షేర్ రాబట్టాల్సి ఉన్నది.ఈ సినిమా ఓవరాల్ గా రూ.400 కోట్ల రూపాయలు క్రాస్ కలెక్షన్ సాధిస్తే బ్రేక్ ఈవెన్ అవుతుంది మరి ఇన్ని రోజులకి రూ .300 కోట్లు వచ్చిన ఈ సినిమా మరో రూ 100 కోట్ల రూపాయలను ఏమాత్రం సాధిస్తుందో చూడాలి మరి.