చై - సమంతలను విడగొట్టిన పాపం.. వాళ్లదేనా?
వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అన్న విషయాన్ని చాలా రోజులపాటు ఎవరు నమ్మలేదు. కానీ ఎట్టకేలకు ఒకవైపు సమంత మరోవైపు నాగచైతన్య అఫీషియల్ ప్రకటన చేయడంతో ఇక అభిమానులు వీరి డైవర్స్ విషయం నమ్మక తప్పలేదు. అయితే ఇప్పటికీ వీరిద్దరూ ఎందుకు విడిపోయారు అన్నది ఒక చిక్కుముడి వీడని ప్రశ్నగా మారిపోయింది. అయితే ఎట్టకేలకు ఇటీవలే నాగచైతన్య కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయంపై స్పందించి క్లారిటీ ఇచ్చారు. సమంత మంచి వ్యక్తి అని తను ఎప్పుడు సంతోషంగా ఉండాలి అంటూ నాగ చైతన్య కోరుకున్నాడు.
సోషల్ మీడియా లో వచ్చిన రూమర్స్ వల్లే మా మధ్య గొడవలు జరిగాయి. మొదట్లో పట్టించుకోకపోయినా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఇప్పుడు మేము విడిపోయిన ఒకరంటే ఒకరికి గౌరవం ఉంది అంటూ నాగచైతన్య చెప్పాడు. నా గతంలో ఏమాత్రం సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగి వాళ్ళని ఆ గౌరవ పరిచినట్లు వార్తలు రాశారు. ఇది ఎంతో బాధించింది అంటూ నాగచైతన్య చెప్పుకొచ్చాడు. అయితే నాగచైతన్య, సమంతను విడగొట్టిన పాపం సోషల్ మీడియాదే అన్నది తెలుస్తుంది. ఎందుకంటే వీరిద్దరి జంట మధ్యలో మూడో వ్యక్తిని తీసుకువచ్చి. ఇక ఏదో ఒకటి తప్పుగా రాసి సోషల్ మీడియాలో వైరల్ గా మార్చారు చాలామంది. ఇక ఇలాంటి వార్తలే నాగచైతన్య సమంత మధ్య మనస్పర్ధలకు కారణమయ్యాయి అన్నది చై చెప్పిన మాటలను బట్టి తెలుస్తుంది. ఇలా చై సమంత లను విడగొట్టిన పాపం మూటగట్టుకుంది మాత్రం సోషల్ మీడియానే అని అభిమానులు అనుకుంటున్న మాట.