లావణ్య త్రిపాఠి వల్లే రష్మిక స్టార్ హీరోయిన్ అయ్యిందనే విషయం మీకు తెలుసా..?

Anilkumar
సౌత్ సినీ ఇండస్ట్రీలో నేషనల్ క్రష్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన కి ఎలాంటి క్రేజీందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఛలో సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ ఇప్పుడు సౌత్ ఇండియాలోనే భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక గత ఏడాది విడుదలైన 'పుష్ప' సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం బడాబడా ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతోంది. కేవలం టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ లో సైతం ఫ్యాన్ ఇండియా సినిమాలు చేస్తోంది. అయితే రష్మిక మందన ఈరోజు ఈ స్థాయిలో ఎదగడానికి హీరోయిన్ లావణ్య త్రిపాఠి కారణమట. ఈ విషయం చాలామందికి తెలియదు. 

అదేంటి? రష్మిక స్టార్ హీరోయిన్ ఇవ్వడానికి లావణ్య కున్న సంబంధం ఏంటని సందేహ పడుతున్నారా? అక్కడికే వస్తున్నా.. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. రష్మిక మందనను స్టార్ హీరోయిన్ చేసిన మూవీ 'గీతగోవిందం'. ఈ సినిమాతోనే రష్మికకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగింది. ఒక విధంగా చెప్పాలంటే గీతాగోవిందం తో రష్మిక ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోయిన్గా వేరే హీరోయిన్ అనుకున్నారట. ఆ హీరోయిన్ పేరే లావణ్య త్రిపాఠి. ముందు ఈ సినిమా కోసం దర్శకుడు లావణ్య త్రిపాఠిని అడిగితే ఆమె నో చెప్పిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

విజయ్ దేవరకొండ తో సినిమాలు అంటే లిప్ లాక్ సీన్స్ ఎక్కువగా ఉంటాయనే రీజన్ తోనే లావణ్య త్రిపాఠి ఈ మూవీని రిజెక్ట్ చేసిందట. దాంతో ఆ ఛాన్స్ కాస్త రష్మిక మందనకు దక్కింది. ఇక సినిమా రిలీజ్ అయి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో రష్మిక స్టార్ హీరోయిన్ అయిపోయింది. అయితే లావణ్య త్రిపాటి ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి చెబుతూ..' ఒకవేళ తాను గీతాగోవిందం మూవీ చేసి ఉంటే ఇప్పుడు రష్మిక లాగే ప్యాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అయి ఉండేదాన్ని అని చెప్పింది'. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ప్రజెంట్ లావణ్య త్రిపాటికి మూవీ ఆఫర్స్ పూర్తిగా తగ్గిపోయాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: