సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంత సింపుల్ గా కనిపిస్తాడో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా సాదాసీదాగా ఉంటాడు మహేష్. కానీ ఎప్పుడైనా వెకేశన్స్ కు వెళితే మాత్రం మహేష్ చాలా కాస్ట్లీ బట్టలను ధరిస్తాడు. ఇక ఆ సమయంలో షూ నుండి క్యాప్ వరకు అన్నిటిపై దృష్టి పెడతారు మన నటిజన్స్. తాజాగా ఎయిర్పోర్టులో లూయిస్ విక్టర్ బ్యాక్ తో దర్శనం ఇచ్చాడు మహేష్. ఇక ప్రస్తుతం ఆ బ్యాక్ కి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఇక షూటింగ్ కి కాస్త గ్యాప్ ఇచ్చిన మహేష్ ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్తూ ఎంజాయ్ చేస్తాడు.
అయితే మన దేశంలో మహేష్ ఎక్కడ కనబడిన కూడా ఫ్యాన్స్ చుట్టూ ముడతారు. మహేష్ కి మనదేశంలో అస్సలు ప్రైవసీ దొరకదు. అందుకే టైం దొరికిన ప్రతిసారి మహేష్ ఫారెన్ కంట్రీలకు వెళతాడు. అయితే తాజాగా ఒక ట్రిప్ కు వెళ్ళాడు మహేష్. ఈ క్రమంలోనే శంషాబాద్ ఎయిర్పోర్టులో మీడియాకు కనిపించాడు. ఇక ఆ సమయంలో మహేష్ బాబు తన భుజానికి కాస్ట్లీ లూయిస్ విట్టర్ క్రిస్టోఫర్ బ్యాక్ బ్యాగ్ తో దర్శనమిచ్చాడు. దీంతో నెటిజన్ల కళ్ళు ఆ బ్యాగు పై పడ్డాయి. చూసిన వెంటనే మహేష్ ధరించిన బ్యాగ్ ధర గూగుల్ తల్లిని అడగడం మొదలుపెట్టారు.
మహేష్ బాబు ధరించిన క్రిష్టఫర్ ఎం ఎం బ్యాక్ ను హై ఎండ్ ఫ్యాషన్ గా భావిస్తున్నారు. మహేష్ ధరించిన ఈ బ్యాక్ నలుపు నీలం డిజైన్తో చాలా అందంగా ఉంది. ఎల్ వి మోనోగ్రామ్ సిగ్నేచర్ డిజైన్ కూడా ఈ బ్యాగు పై ఉండడం గమనార్హం. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు మహేష్ బాబు ధరించిన ఈ బ్యాగ్ ధర ఏకంగా 3,92,650 ఆరు రూపాయలు మహేష్ బాబు ధరించిన ఈ బ్యాగ్ చాలా సొగసైన డిజైన్తో విశాలమైన కంపార్ట్మెంట్ లతో ఉంటుందట. ఇదిలా ఉంటే ఇక ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఎస్ ఎస్ ఎన్ బి 28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ కూడా పూర్తయింది..!!