ఈ వారం థియేటర్లలో పోటీ పడబోతున్న సినిమాలు ఇవే..!
లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత దర్శకుడు శ్రీవాస్ గోపీచంద్ తో మూడవ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎమోషన్స్ కు లవ్, కామెడీని జోడిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ మళ్ళీ రామబాణం అంటూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ కాంబినేషన్ మళ్ళీ విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక ఇందులో డింపుల్ హయతి హీరోయిన్గా నటించగా.. జగపతిబాబు, కుష్బూ దంపతులుగా కీలక పాత్రలు పోషించారు.. ఇక నిన్న హైదరాబాదులో గ్రాండ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా చేశారు. ఈ సినిమా మే 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.
మరొకవైపు నాంది సక్సెస్ తర్వాత అల్లరి నరేష్.. అదే సినిమా డైరెక్టర్ విజయ్ కనకమెడల కాంబినేషన్లో ఉగ్రం సినిమాతో మే 5వ తేదీన వస్తున్నాడు. ఇక కెరియర్ ముగిసిపోతుంది అని అనుకుంటున్న సమయంలో నాంది సినిమాతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయినా అల్లరి నరేష్ ఇప్పుడు మరోసారి సక్సెస్ కోసం దర్శకుడు విజయ్ ని నమ్ముకున్నాడు .ఉగ్రం సినిమాలో అల్లరి నరేష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రేక్షకులను అలరించబోతున్నట్లు సమాచారం.
ఇక ఈ రెండు సినిమాలతో పాటు అరంగేట్రం, హీట్ అనే సినిమాలు కూడా మే 5వ తేదీన విడుదల కాబోతున్నాయి ఇకపోతే రెండు పెద్ద సినిమాల తాకిడిని తట్టుకొని ఈ సినిమాలు ఏ మేరకు థియేటర్లో నిలబడతాయి అన్నది ఇంకా సందేహంగానే మారింది. వీటితోపాటు హాలీవుడ్ సూపర్ హిట్ ఫ్రాంచైజ్ గార్డియన్ ఆఫ్ గెలాక్సీ 3 కూడా మే 5వ తేదీన ఇంగ్లీష్ తెలుగులో విడుదల కాబోతోంది.