చీర కట్టులో ట్రెడిషనల్ లుక్ లో మైమరపిస్తున్న శోభిత ధూళిపాల..!

Pulgam Srinivas
అడవి శేషు హీరో గా రూపొందిన గూడచారి మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న శోభిత ధూళిపాల గురించి ప్రత్యేకం గా తెలుగు సినీ ప్రేమికు లకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈ ముద్దుగుమ్మ పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి మేజర్ మూవీ లో కూడా కీలక పాత్ర లో నటించి మరో విజయాన్ని తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని తన క్రేజ్ ను మరింతగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో పెంచుకుంది .

 ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ పొన్నియన్ సెల్వన్ మూవీ లో కీలక పాత్రలో నటించింది. పోయిన సంవత్సరం విడుదల అయిన ఈ మూవీ మొదటి భాగం మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ మూవీ యొక్క రెండవ భాగం ఏప్రిల్ 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ మూవీ రెండవ భాగం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది. ఈ మూవీ లోని శోభిత నటనకు ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.
 


ఇది ఇలా ఉంటే ఈ మధ్య కాలంలో శోభిత తనకు సంబంధించిన ఫోటోలను ఎక్కువ శాతం చాలా సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ ఎల్లో కలర్ లో ఉన్న చీరలు కట్టుకొని ... పర్పుల్ అండ్ ఎల్లో కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. శోభిత కు సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ముద్దుగుమ్మకు ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు కూడా దక్కుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: