రమ్యకృష్ణ కి ఆ స్టార్ డైరెక్టర్ అంటే చాలా ఇష్టమట.. ఎందుకో తెలుసా..!?

Anilkumar
90స్ స్టార్ హీరోయిన్గా ఒక విలువ వెలిగిన రమ్యకృష్ణ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.సౌత్ సినీ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈమె ఐదు పదుల వయసు వచ్చినప్పటికీ చెరగని అందంతో కుర్రకారులను ఎప్పటికీ కూడా ఫిదా చేస్తూనే ఉంది. ఇక అలాంటి రమ్యకృష్ణ 1984లో కంచు కాగడా అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తరువాత ఏకంగా 16 సినిమాల్లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది ఆమె.రమ్యకృష్ణ 16 సినిమాల్లో నటించినప్పటికీ ఒక్క సినిమా కూడా హిట్ ను అందుకోలేదు.

 దాంతో చాలామంది అప్పట్లో రమ్యకృష్ణ ని ఐరన్ లెగ్ అంటూ కూడా పిలిచారు.దాని అనంతరం ఎప్పుడైతే రమ్యకృష్ణ రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో వచ్చిన అల్లుడు గారు అనే సినిమాలో నటించిందో అప్పటినుండి ఈమె రేంజ్ మారిపోయింది అని చెప్పాలి. వాటితో పాటు రమ్యకృష్ణ కి స్టార్ డం రావడానికి కూడా రాఘవేంద్రరావు అని చెప్పడంలో ఇలాంటి సందేహం లేదు . ఇక ఈ విషయాన్ని చాలా సార్లు రమ్యకృష్ణ స్వయంగా చెప్పుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందుకే రమ్యకృష్ణకు రాఘవేంద్రరావు అంటే ఎనలేని అభిమానం అంటూ కూడా చాలా సందర్భాలలో ఆమె చెప్పింది.

 అంతేకాకుండా ఆమె చనిపోయే వరకు కూడా రాఘవేంద్రరావు గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అంటూ ఇంటర్వ్యూలలో సైతం చెప్పుకొచ్చింది . రాఘవేంద్రరావు లేకపోతే ఆమె లేదు అని ఇప్పుడు తను ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం రాఘవేంద్రరావు అంటూ కూడా ఆ ఇంటర్వ్యూలో భాగంగా పేర్కొంది రమ్యకృష్ణ. దీంతో ప్రస్తుతం రమ్యకృష్ణ రాఘవేంద్రరావు గురించి మాట్లాడిన మాటలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ప్రస్తుతం రమ్యకృష్ణ సీనియర్ హీరోయిన్స్ లో బిజీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతోంది. ఒకవైపు అగ్ర హీరోల సినిమాలలో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లోను నటిస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: