మరాఠీ సామ్రాజ్య వ్యవస్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పెద్ద కుమారుడు అయిన శంభాజీ బోన్స్లే జీవితం ఆధారంగా తీసుకుని హిందీలో ఒక పిరియాడికల్ సినిమాని రూపొందించబోతున్నారు. ఇక ఈ సినిమాకి చావా అనే టైటిల్ ని కూడా పెడదామని భావిస్తున్నారు.లక్ష్మణ్ ఉటేకర్ దర్శనత్వం వహించనున్న ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ పాత్రను విక్కీ కౌశల్ పోషించబోతున్నాడు. ఇక ఆయన భార్య మహారాణి యేసు బాయి బోన్స్లే పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన నటించబోతోంది అన్న వార్తలు వినబడుతున్నాయి.
ఈ సినిమా కథ నచ్చి ఈ సినిమాలో నటించడానికి రష్మిక మందన ఒప్పుకుండట. ఇక ఆ కాలపు యాక్సెంట్ నేర్చుకోవడం కోసం రష్మిక మందన దానికి సంబంధించిన ఒక ప్రత్యేక శిక్షణ కూడా తీసుకుంటుంది అన్న వార్తలు సైతం వినబడుతున్నాయి. ఇక యుద్ధాల కోసం శంభాజీ పక్క దేశాలకు వెళ్ళినప్పుడు రాజమహల్ లో అనగా యేసుబాయ్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది ఇలాంటి రాజకీయ వ్యూహాలను రచించారు అన్న తరహాలో కూడా ఈ సినిమా కథ నువ్వవుతుందని తెలుస్తుంది. ఇక దానికి సంబంధించిన స్క్రిప్టును చాలా జాగ్రత్తగా రెడీ చేశారట ఈ సినిమా దర్శకుడు లక్ష్మణ్.
ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ సెప్టెంబర్ లో ప్రారంభించబోతున్నట్లుగా కూడా వార్తలు అయితే వినబడుతున్నాయి. అయితే ఇప్పటికే హిందీలో గుడ్ బై మిషన్ వంటి సినిమాలు లో నటించింది రష్మిక మందన ప్రస్తుతం ఈమె రణబీర్ కపూర్ తో యానిమల్ అనే సినిమా చేసే పనిలో బిజీగా ఉంది. వాటితో పాటు టాలీవుడ్ స్టార్ హీరో అయినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప ది రుల్ సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తోంది రష్మిక మందన. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉంది రష్మిక మందన ..!!