పొన్నియన్ సెల్వన్ లో.. ఐశ్వర్యరాయ్ పాత్రను ఆ హీరోయిన్ వదులుకుందట?

praveen
మణిరత్నం  దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పొన్నియన్ సెల్వన్ సినిమాకు సీక్వెల్ సినిమా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సీక్వెల్ అటు మొదటి పార్ట్ తో పోల్చి చూస్తే ఎంతో బెటర్ అంటూ ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే పొన్నియన్ సెల్వన్ సినిమాలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్యారాయ్ ఎన్నో రోజుల తర్వాత నటించిన సంగతి మనకు తెలిసిందే. తన పాత్రలో అద్భుతమైన హవ భావాలు పండించి ఇక తన అందం అభినయంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది ఐశ్వర్యరాయ్.



 అయితే సినిమా ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన పాత్ర మరొకరు చేయడం ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. ఇక పొన్నియన్ సెల్వన్ సినిమాలో కూడా ఐశ్వర్య రాయి నటించిన పాత్ర కోసం ముందుగా ఆమెను అనుకోలేదట. అయితే లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కి ఐశ్వర్యారాయ్ మొదటి నుంచి లక్కీ హీరోయిన్గా కొనసాగుతూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కూడా అటు మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమాలో పాత్ర కోసం ముందుగా ఐశ్వర్యరాయ్ ని అనుకోలేదట.



 అయితే ఈ సినిమా రెండు పార్ట్ లుగా తెరకెక్కించారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ కోసం ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వాల్సి రావడంతో ఇక మణిరత్నం ముందుగా అనుకున్న హీరోయిన్ సెట్ కాలేదట. దీంతో ఈ పాత్ర కోసం ఐశ్వర్య రాయ్ అయితే బాగుంటుందని మణిరత్నం భావించి చివరికి తన లక్కీ హీరోయిన్ కి ఛాన్స్ ఇచ్చాడట. ఇకపోతే మొదటి భాగంలో ఐశ్వర్యరాయ్ పాత్ర నెగెటివ్ గా ఉన్నట్లు కనిపించినప్పటికీ రెండవ భాగంలో మాత్రం ఆమె అసలైన క్యారెక్టర్ రివీల్ అవుతుంది. పొన్నియన్ సెల్వన్ సినిమా విడుదలైన తర్వాత ఐశ్వర్యరాయ్ పాత్రలో మరొకరిని ఊహించుకోలేకపోతున్నారు అభిమానులు. ఇంతకీ ఈ పాత్ర వదులుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా సౌత్ లో లేడీస్ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న నయనతార.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: