హాట్ టాపిక్ గా మారిన అలియా భట్ పెట్టుబడులు !

Seetha Sailaja
బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలకే కాకుండ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు చిరునామాగా ఒక వెలుగు వెలుగుతున్న అలియా భట్ పెళ్ళి చేసుకుని తల్లి అయినప్పటికీ ఇండస్ట్రీలో ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమెకు వరసపెట్టి అవకాశాలు వస్తూనే ఉన్నాయి. బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటించే మూవీలో అలియా భట్ ను హీరోయిన్ గా తీసుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.



లేటెస్ట్ గా ఆమె కొనుక్కున్న ఒక పెద్ద భవనం బాలీవుడ్ మీడియాలో హాట్ న్యూస్ గా మారింది. అలియా భట్ కు సంబంధించిన ఒక ప్రొడక్షన్ హౌస్ పేరిట ఆమె ఈ విలాసవంతమైన ఇంటిని ముంబాయ్ లో 37 కోట్లకు కొన్నట్ట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విలాసవంతమైన భవనం రిజిస్ట్రేషన్ కు ఏకంగా ఆమె 2 కోట్లకు పైగా స్టాంప్ డ్యూటీ కట్టింది అంటు ఆమె పై బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.  



ఇప్ప‌టికే అలియా భ‌ట్ కు ముంబాయ్ లో అనేక ఇళ్లు ఉన్నాయి. మరొకవైపు ఆమె త‌న భ‌ర్త ర‌ణబీర్ క‌పూర్ తో క‌లిసి 8 అంతస్థుల సొంత భ‌వ‌నాన్ని కూడా ఆమె క‌ట్టుకుంటోంది. ఈ భవనం నిర్మాణంలో ఉండగానే అలియా తన సినిమా నిర్మాణ సంస్థ పేరిట 37 కోట్ల విలువైన ఇల్లు కొనుగోలు చేయ‌డం ఇప్పుడు బాలీవుడ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది.



అంతేకాదు ఈమధ్య అలియా భట్ తన పేరు మీద ఉన్న 2 ఫ్లాట్స్ కు తన సోదరికి ఇచ్చినట్లుగా కూడ వార్తలు వస్తున్నాయి. త‌న సోద‌రి ష‌హీన్ పేరిట అలియా భ‌ట్ బ‌దిలీ చేసిన రెండు ఫ్లాట్ల విలువ సుమారు 7.68 కోట్ల రూపాయ‌ల విలువ ఉంటుందని బాలీవుడ్ మీడియా వార్తలు వ్రాస్తోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో ఆమె నటించిన అతి చిన్న పాత్రకు ఆమె 5 కోట్లు పారితోషికం తీసుకుంది అంటే ఆమె రేంజ్ ఏమిటో అర్థం అవుతుంది..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: