టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో ఉన్న బ్లాక్ బస్టర్ మూవీస్ లో 'బిజినెస్ మెన్' కూడా ఒకటి. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మహేష్ - పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన వచ్చిన ఈ సినిమా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబుని చాలా డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపించాడు పూరి జగన్నాథ్. ముఖ్యంగా ఈ సినిమాలో మహేష్ చెప్పే డైలాగ్ లు, యాక్షన్ సీన్స్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇక ఈ సినిమాలో మహేష్ కి జోడిగా అందాల చందమామ కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే.
సినిమాలో మహేష్, కాజల్ కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. అయితే ఈ సినిమాలో కాజల్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఓ అమ్మాయి నటించింది. సినిమాలో తన బట్లర్ తెలుగు డైలాగ్స్ ని క్యూట్ క్యూట్ గా చెబుతూ ఆకట్టుకుంది.' మీరు రిచ్ కిడ్ కదా?.. 'కార్ లేని వాడితో కాపురం ఎలా చేస్తావే? అంటూ ముద్దుగా మాట్లాడిన ఆ అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? ప్రజెంట్ ఆమెని చూస్తే షాక్ అయిపోతారు. ఇంతకీ ఆ అమ్మాయి పేరు ఆయేషా శివ. ఈమె పలు బాలీవుడ్ సినిమాలో నటించింది. అదే సమయంలో పూరీ జగన్నాథ్ ఈమెకు బిజినెస్ మాన్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ కి ఎంపిక చేసాడు. అలా బిజినెస్ మాన్ లో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించిన ఆయేషా శివ తన క్యూట్ క్యూట్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది.
అయితే బిజినెస్ మెన్ తర్వాత ఆయేషా శివ మరో తెలుగు సినిమా చేయలేదు. తాజాగా ఈమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. అప్పటికంటే ఇప్పుడే ఇంకా అందంగా ఉంది ఈ ముద్దుగుమ్మ. దీంతో నెటిజన్స్ సోషల్ మీడియాలో ఈ అమ్మడి లేటెస్ట్ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు. అంతేకాకుండా బిజినెస్ మాన్ పాప అప్పటికంటే ఇప్పుడే చాలా క్యూట్ గా ఉందని కొంతమంది నెటిజెన్స్ కామెంట్ చేస్తుంటే.. బిజినెస్ మాన్ మూవీలో కాజల్ ఫ్రెండ్ ఇప్పుడు సూపర్ గా ఉందంటూ మరికొంతమంది నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.ఇక మహేష్ ఫాన్స్ మాత్రం ఈమె మళ్లీ సినిమాల్లో నటిస్తే బాగుంటుందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు...!!