విరుపాక్ష సూపర్ హిట్.. సంయుక్త ఎంత రేటు పెంచిందో తెలుసా?

praveen
కొంతమంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చి కేవలం ఒకటి రెండు సినిమాలతోనే సరిపెట్టుకొని కనుమరుగవుతూ ఉంటారు . మరి కొంతమంది మాత్రం ఇక ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి  అదరగొడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్గా కూడా పేరు సంపాదించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఆ లిస్టులో చేరిపోయింది  సంయుక్త మీనన్. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన బీమ్లా నాయక్ సినిమాలో రానా సరసన నటించింది. అయితే ఈ అమ్మడు చేసింది చిన్న పాత్ర అయినా తన అందం అభినయంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది.


 ఇక ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సరసన భింభిసార, ధనుష్ సరసన సార్ సినిమాల్లో నటించి కమర్షియల్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది.  ఇక ఇప్పుడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన విరుపాక్ష సినిమాలో నటించి మరో హిట్ సొంతం చేసుకుంది అని చెప్పాలి. విరుపాక్ష సినిమా భారీ వసూళ్ల దిశగా పరుగులు తీస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇలా వరుసగా ఇట్లు సాధిస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇక అందరిలాగానే పారితోషకం పెంచేందుకు సిద్ధమవుతుంది అన్నది తెలుస్తుంది.


 ఇప్పటివరకు చేసిన సినిమాలలో సంయుక్తా మీనన్ కేవలం కోటి లోపే పారితోషకం తీసుకుందట. అయితే ఇక ఇప్పుడు తాను చేసిన సినిమాలు అన్నీ హిట్ అవుతూ ఉండడంతో లక్కీ హీరోయిన్గా మారిపోయింది. దీంతో ఇక రెమ్యూనరేషన్ కోటి నుంచి రెండు కోట్లకు చేయబోతుంది అన్నది తెలుస్తుంది. అయితే ఓ సినిమా కోసం ఒక నిర్మాత సంయుక్త సంప్రదించగా.. ఇక రెండు కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో ఆయన షాక్ అయ్యారట. మీ రేంజ్ కి నేను సరిపోను లేండి.. అంటూ అక్కడ నుంచి వెళ్లిపోయాడట నిర్మాత. అయితే సక్సెస్ వచ్చినప్పుడు కాకుండా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు రెమ్యూనరేషన్ పెంచుతారా.. పారితోషకం పెంచి మంచి పని చేసిందని అభిమానులు మద్దతుగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: