ఆ రెండు సినిమాల్లో పాటలు పాడనున్న పవన్ కళ్యాణ్..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఖరుగా పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి భీమ్లా నాయక్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందినటువంటి ఈ మూవీ లో దగ్గుపాటి రానా కూడా హీరో గా నటించాడు. ఈ మూవీ లో పవన్ సరసన నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించగా ... రానా సరసన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. తమన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది.


ఇది ఇలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ... క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ నటిస్తోంది. ఈ మూవీ తో పాటు హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లోను ... సుజిత్ దర్శకత్వంలో రూపాందుతున్న ఓ జి మూవీ లోను హీరో గా నటిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ ... క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న హరిహర వీరమల్లు మూవీ లో ఒక పాటను పడనునట్లు ... హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లోను ఒక పాటను పాడబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


ఇది ఇలా ఉంటే నిజం గానే ఈ సినిమాలలో కనుక పవన్ పాటలు పాడినట్లు అయితే ఈ సినిమా మ్యూజిక్ ఆల్బమ్ పై  ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు ... ఉస్తాద్ భగత్ సింగ్ ... ఓ జి మూవీ షూటింగ్ లలో పాల్గొంటూ ఫుల్ బిజీగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: