ఏజెంట్ విషయంలో నాగార్జున సూచన అమలు జరుగలేదా ?

frame ఏజెంట్ విషయంలో నాగార్జున సూచన అమలు జరుగలేదా ?

Seetha Sailaja
ఈవారం విడుదల కాబోతున్న ‘ఏజెంట్’ మూవీ అఖిల్ కెరియర్ కు పెద్ద పరీక్షగా మారింది. వరస ఫ్లాప్ లతో సతమతమైపోయిన అతడి కెరియర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్’ మూవీతో ఫర్వాలేదు అని అనిపించుకున్నప్పటికీ ఒక భారీ సక్సస్ ఇప్పటి వరకు అతడి కెరియర్ లో రాకపోవడంతో ఆలోటు ‘ఏజెంట్’ తీరుస్తుందని అఖిల్ చాల ఆశలు పెట్టుకున్నాడు.


ఈమూవీ కోసం అఖిల్ చాల కష్టపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడ్డ ఈమూవీ రిలీజ్ ఎట్టకేలకు ఈవారం విడుదల అవుతున్నప్పటికీ హాలీవుడ్ సినిమా లా పూర్తీ యాక్షన్ సీన్స్ తో నిలిపివేసిన ఈమూవీ ఎంతవరకు సగటు ప్రేక్షకుడుకి కనెక్ట్ అవుతుంది అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలలో కొందరికి ఉన్నాయి.


అఖిల్ కు బ్లాక్ బష్టర్ హిట్ రావాలి అని కోరుకుంటున్న నాగార్జున ఈసినిమా మేకింగ్ విషయంలో కానీ ఎడిటింగ్ విషయంలో కానీ పెద్దగా పట్టించుకోలేదు అన్నవార్తలు ఉన్నాయి. వాస్తవానికి ఈమూవీ కథను ఫైనల్ చేసిన తరువాత నాగార్జున ఈమూవీలో అఖిల్ తో మమ్ముట్టి నటించిన పాత్రలో నటించడానికి ఆశక్తి కనపరిచాదట. అయితే సురేంద్ర రెడ్డి ఈవిషయంలో నాగార్జున అభిప్రాయానికి ఓకె చేయకుండా మమ్ముట్టిని ఫైనల్ చేసాడు అన్న గాసిప్పులు ఇండస్ట్రీ వత్గాలలో ఉన్నాయి. ఇలా సురేంద్ర రెడ్డి నిర్ణయం తీసుకోవడం వెనుక ఒక సెంటిమెంట్ ఉంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు నాగార్జున ఈ మధ్యకాలంలో నటించిన యాక్షన్ సినిమాలు ‘వైల్డ్ డాగ్’ ‘ది ఘోస్ట్’ సినిమాలు ఈమధ్య కాలలంలో భయంకరమైన ఫ్లాప్ లుగా మారడంతో సెంటిమెంట్ రీత్యా అఖిల్ పక్కన నాగార్జున కంటే మమ్ముట్టి అన్నివిధాల సరిపోతాడని సురేంద్ర రెడ్డి భావించి ఉంటాడు అంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరి సురేంద్ర రెడ్డి మనసులో పెట్టుకున్న ఈ సెంటిమెంట్ ఎంతవరకు ‘ఏజెంట్’ కలిసి వచ్చి కలక్షన్స్ ను కురిపించి అఖిల్ కు కల నెరవేరుస్తుందో చూడాలి..




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: