తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించిన త్రిష గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ మెగాస్టార్ చిరంజీవి ... నందమూరి నటసింహం బాలకృష్ణ ... టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ... విక్టరీ వెంకటేష్ లాంటి సీనియర్ స్టార్ హీరో లతో పాటు ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సూపర్ స్టార్ మహేష్ బాబు ... యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఈతరం స్టార్ హీరోలతో కూడా నటించి ఎన్నో సంవత్సరాల పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగించింది.
ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తమిళ సినిమా ఇండస్ట్రీ లో ఉన్న ఎంతో మంది స్టార్ హీరోల సరసన కూడా నటించి తమిళ సినిమా ఇండస్ట్రీ లో కూడా స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించింది. ప్రస్తుతం త్రిష తలపతి విజయ్ హీరో గా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో రూపొందుతున్న లియో మూవీ లో హీరోయిన్ గా నటిస్తుంది.
తాజాగా ఈ ముద్దు గుమ్మ పొన్నియన్ సెల్వన్ మూవీ లో కీలక పాత్రలో నటించింది. పోయిన సంవత్సరం విడుదల అయిన ఈ మూవీ మొదటి భాగం మంచి విజయం అందుకుంది. ఈ మూవీ రెండవ బాగానే ఈ సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ ఈ మధ్య కాలంలో తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా త్రిష తన సోషల్ మీడియా అకౌంట్ లో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఉన్న శారీని కట్టుకొని ... అందుకు తగిన బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.