వైట్ కలర్ శారీలో మెరిసిపోతున్న సంయుక్తా మీనన్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వరుస విజయాలను అందుకుంటూ స్టార్ హీరోయిన్ రేస్ లో ముందున్న ముద్దు గుమ్మలలో ఒకరు అయినటు వంటి సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ పోయిన సంవత్సరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... దగ్గుపాటి రానా హీరో లుగా రూపొందినటు వంటి భీమ్లా నాయక్ మూవీ లో రానా కు జోడి గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది.
 


ఈ మూవీ తో ఈ ముద్దు గుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ లభించింది. ఆ తర్వాత ఈ ముద్దుగుమ్మ బింబిసారా ... సార్ తాజాగా విరూపాక్ష సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఈ మూడు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే రేంజ్ విజయాలను అందుకున్నాయి. అలాగే ఈ సినిమా లలో ఈ ముద్దు గుమ్మ తన అంద చందాలతో ... నటన తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. దానితో ప్రస్తుతం సంయుక్త తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ రేస్ లో ముందు వరుసలో ఉంది.
 


ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో సంయుక్త అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కాలర్ సారి ని కట్టుకొని ..  అందుకు తగిన వైట్ కలర్ బ్లౌజ్ ను ధరించి చేతిలో పువ్వులను పట్టుకొని అదిరిపోయే స్టైలిష్ యాంగిల్ లలో లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం సంయుక్తా
 కు సంబంధించిన ఈ స్టైలిష్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సంయుక్త ... కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందుతున్న డెవిల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: