మృనాల్ ఠాకూర్ పై మండిపడుతున్న నెటిజన్స్...!!

murali krishna
సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు సీతామహాలక్ష్మిగా కనిపించింది నటి మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో ఈమె అచ్చమైన తెలుగు అమ్మాయిగా నిండుగా చీర కట్టుకొని ఎంతో పద్ధతిగా నటించింది.

ఇలా ఈ పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె మొదటి సినిమాతో నే ఎంతో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల ను కూడా ఆమె సొంతం చేసుకున్నారు. ఇలా సీతామహాలక్ష్మి పాత్ర లో ఒదిగిపోయిన ఈమెకు తెలుగు లో వరుస సినిమా అవకాశాలు అయితే వస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు సినిమాలతో పాటు ఇతర భాష సినిమాల తో కూడా నటిస్తూ బిజీ గా ఉన్నారు.

వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు ముందు కూడా ఈమె సోషల్ మీడియాలో ఎన్నో బోల్డ్ ఫోటోలను అయితే పోస్ట్ చేశారు.అయితే ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున గ్లామర్ షో చేస్తూ ఫోటోలను పోస్ట్ చేయడంతో ఎంతోమంది అభిమానులు అసలు మేము చూసిన, అభిమానించిన సీతామహాలక్ష్మివేనా నువ్వు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె ఒక మ్యాగజైన్ కోసం పెద్ద ఎత్తున ఫోటోషూట్ చేయించారు. ఫస్ట్ లుక్ అనే మ్యాగజైన్ కోసం ఈమె ఫోటో షూట్ చేయించడమే కాకుండా అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి.ఈ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్స్ ముందు మీరు ఆ ఫోటోలను డిలీట్ చేసేయండి అంటూ కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు నువ్వు మా సీతామహాలక్ష్మివి కాదు అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. ఏది ఏమైనా ఈమె తన హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను ఊపేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: