ఆదిపురుష్ సాహసానికి షాక్ అవుతున్న ఇండస్ట్రీ వర్గాలు !

Seetha Sailaja

మరో రెండు నెలల్లో ‘ఆదిపురుష్’ విడుదలకాబోతోంది. ఈ మూవీ ట్రైలర్ కు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ తో ప్రభాస్ అభిమానులకు ఈ మూవీ పై అనేక సందేహాలు ఉన్నాయి. సాధారణంగా ఇలా నెగిటివ్ టాక్ విడుదలకు ముందు ఏర్పరుచుకున్న సినిమాలను ప్రీమియర్ షోలుగా రిలీజ్ కు ముందు అందరికీ చూపించడానికి భారీ సినిమాలను తీసిన నిర్మాతలు భయపదిపోతూ ఉంటారు.


అయితే దీనికి భిన్నంగా ‘ఆదిపురుష్’ నిర్మాతలు వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా విడుదలకు మూడు రోజులు ముందు న్యూయార్క్ లో జరిగే ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్ లో అధికారికంగా ప్రీమియర్ చేయబోతున్నట్టు టీమ్ అఫీషియల్ గా ప్రకటించింది. దీనితో ప్రభాస్ అభిమానులలో మరింత కలవరం మొదలైంది.


అమెరికాలో జరిగే ఫిలిం ఫెస్టివల్ లో ఈ సినిమాను చూసిన విమర్శకులు ఈసినిమా  గురించి మూవీ విడుదలకు ముందే సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టే ఆస్కారం ఉంది. ఇలా సినిమాకు సంబంధించిన విషయాలు మూడు రోజులకు ముందు లీక్ అయితే ఏమాత్రం నెగిటివ్ స్ప్రెడ్ అయితే ఈ మూవీ ఫలితం పై తీవ్రంగా ప్రభావం చూపించే ఆస్కారం ఉంది అంటూ ప్రభాస్ అభిమానులు గగ్గోలు పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన గ్రాఫిక్ వర్క్స్ ప్రభాస్ అభిమానులు ఆశిస్తున్నట్లుగా పూర్తిగా రిపేర్ చేయడం జరగలేదని కొన్ని సీన్స్ మాత్రం మార్చారు అని అంటున్నారు. అంతేకాదు ఈసినిమాకు సంబంధించి కలర్ కలక్షన్ మాత్రమే జరిగింది కాని గ్రాఫిక్ వర్క్స్ లో పెద్దగా మార్పులేదు అని అంటున్నారు. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఈసినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోలను ముందుగా ధియేటర్లలో వేసి ఆ షోకు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలను మరికొందరు మేధావులను ఆహ్వానించి ‘ఆదిపురుష్’ సినిమాను చూడండి అంటూ ఆ ప్రముఖుల చేత మెప్పును పొందాలని దాని ద్వారా ఈమూవీకి భారీ పబ్లిసిటీ వస్తుందని ఈమూవీ నిర్మాతల అంచనా అన్న మాటలు వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: