తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి విడుదలకు రెడీగా ఉండి భారీ అంచనాలు కలిగి ఉన్న సినిమాలలో ఒకటి "పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2". మొత్తంగా రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం పోయిన సంవత్సరం భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించినప్పటికీ ఇతర భాషా ప్రేక్షకులను మాత్రం ఏ రేంజ్ లో అలరించడంలో కాస్త విఫలం అయింది. ఇది ఇలా ఉంటే ఈ భారీ బడ్జెట్ మూవీ కి మణిరత్నం దర్శకత్వం వహించగా ... చియాన్ విక్రమ్ , కార్తీ , జయం రవి , ఐశ్వర్యా రాయ్ , త్రిష , శోభితా ధూళిపాల ఈ మూవీ లో కీలక పాత్రలలో నటించారు. ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు.
ఈ మూవీ యొక్క మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ... ఈ మూవీ యొక్క రెండవ భాగంపై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా రెండవ భాగంపై మిగతా ప్రాంతాల ప్రేక్షకులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యొక్క రెండవ భాగాన్ని ఏప్రిల్ 28 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ సినిమా బృందం ఈ మూవీ ప్రమోషన్ లను నిర్వహిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని "యూ ఎస్ ఏ" లో ఇప్పటివరకు ఏ తమిళ సినిమా కూడా రిలీజ్ కానీ రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా "యూ ఎస్ ఏ" లో ఈ మూవీ ని 1100 షో స్ ప్రీమియర్స్ వెయ్యనున్నట్లు తెలుస్తోంది. ఇలా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2 సినిమాను "యూ ఎస్ ఏ" లో భారీ ఎత్తున విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.